Kaala Teaser Breaks Records on YouTube | సూపర్ స్టార్ స్టామినాకు ఇదే ఫ్రూఫ్

Kaala teaser count continues

Rajinikanth, Kaala Teaser, YouTube Record, 2 Crore Views, Pa Ranjith, Kaala Teaser Record, 2.O Teaser Leaked

Rajinikanth Kaala Teaser Shutters YouTube Record. In All Languages Kaala Teaser get 2 Crore Views and Count Continues.

కాలా టీజర్ దూసుకుపోతోంది

Posted: 03/05/2018 12:31 PM IST
Kaala teaser count continues

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' చిత్రం టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. వీక్షకుల సంఖ్య రెండు కోట్లను(అన్ని భాషల్లో కలిపి) క్రాస్ చేసింది. ఇంకా అదే జోరును కొనసాగిస్తోంది. ఒక తమిళ్ టీజర్ కోటి యాభై లక్షలకు పైగా వ్యూవ్స్ రాబట్టగా.. తెలుగులో 3.1 మిలియన్ వ్యూవ్స్, హిందీలో 1.5 మిలియన్ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. తద్వారా సూపర్‌స్టార్ మరోసారి తన స్టామినా చాటుకుంటున్నారు.

గతంలో 'కబాలీ' చిత్రం టీజర్‌కి కూడా ఇదే విధమైన అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దానికి దర్శకత్వం వహించిన యువ సంచలనం పా రంజితే కాలాని కూడా డైరెక్ట్ చేశాడు. స్టైల్ అంటేనే రజనీ. అలాంటి రజనీని కబాలీతో పాటు కాలాలోనూ అద్భుతంగా చూపించాడు రంజిత్. మాఫియా నేపథ్యంతో సాగే సినిమా ఇది.

బాలీవుడ్ నటుడు నానా పటేకర్, ఈశ్వరి, హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి రజనీ అల్లుడు ధనుష్ నిర్మాత. సంతోష్ నారాయణ్ బాణీలు సమకూర్చాడు. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

2.ఓ టీజర్ లీక్ పై సెటైర్లు.. 

శంకర్ డైరెక్షన్ లో రజనీ కాంత్ హీరోగా తెరకెక్కించిన రోబో 2.ఓ చిత్ర టీజర్ లీక్ కావటంతో నిన్నంతా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడో స్క్రీన్ మీద ప్రదర్శించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. విజువల్ క్వాలిటీ పూర్ గా ఉన్న ఈ టీజర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు కాలా ప్రభంజనం కొనసాగుతున్న వేళ ఈ టీజర్ లీక్ నిర్మాతలు చేసిన పబ్లిసిటీ స్టంట్ అంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles