Kamal announced to produce a film with Vikram | విక్రమ్ తో కమల్ చిత్రం అనౌన్స్ మెంట్.. కానీ...

Kamal movie with chiyaan

Kamal Haasan, Vikram, Akshara Haasan, Rajesh M Selva, Kamal Vikram, Kamal Vikram Movie Thoongaa Vanam Director, Vikram Akshara Haasan

Chiyaan Vikram to act in Kamal Haasan's production. Thoongaa Vanam director Rajesh M Selva Confirmed for this project Kamal Officially announced in Twitter. Akshara Haasan on board for this Project.

కమల్ నిర్మాత.. విక్రమ్ హీరోగా సినిమా

Posted: 01/20/2018 04:13 PM IST
Kamal movie with chiyaan

లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ మళ్లీ నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. త్వ‌ర‌లో చియాన్ విక్రమ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కమల్ రెండో తనయ అక్ష‌ర హాస‌న్ హీరోయిన్ గా న‌టించ‌బోతుండగా.. సినిమాకు కమల్ శిష్యుడు రాజేశ్ ఎమ్ సెల్వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించబోతున్నాడు. గతంలో కమల్ ను రాజేష్ తుంగవనమ్ (చీకటి రాజ్యం) డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ట్రైడెంట్ ఆర్ట్స్‌తో క‌లిసి త‌న రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్న‌ట్లు క‌మ‌ల్ ఓ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. నిజానికి ఈ సినిమా గురించి జ‌న‌వ‌రి 1వ తేదీనే ప్ర‌క‌టించాల్సి ఉంది కానీ డిసెంబ‌ర్ 31న విక్ర‌మ్ తండ్రి చ‌నిపోవ‌డంతో ఈ ప్ర‌క‌ట‌న‌ను వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది.

హిందీలో షమితాబ్ తో ఆకట్టుకున్న అక్షర.. త‌మిళంలో న‌టించ‌బోతున్న రెండో చిత్రం ఇది. గ‌తేడాది అజిత్‌ 'వివేగం' లో అక్షర హ్యాక‌ర్ పాత్ర‌లో క‌నిపించింది. ఓ ఫ్రెంచి సినిమా ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles