Big B and Kangana could co-star in R Balki Next | వికలాంగురాలిగా కంగనా.. అమితాబ్ హీరో?

Kangana with amitabh bachchan

R Balki, Kangana Ranaut, Amitabh Bachchan, Manikarnika, Arunima Sinha Biopic, Kangana Big B, Big B Kangana, Kangana 2018 Moives

R Balki’s next to feature Kangana Ranaut and Amitabh Bachchan. According to a mid-day report, filmmaker R Balki has apparently approached Kangana to play the role of an amputee, 'who reclaims her life after a freak accident' with the help of her mentor.

అమితాబ్ తో కంగనా చిత్రం

Posted: 01/09/2018 03:52 PM IST
Kangana with amitabh bachchan

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలెంటెడ్ నటి కంగనా రనౌత్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. 'ప్యాడ్ మ్యాన్' త‌ర్వాత ఆర్ బాల్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న చిత్రంలో వీరిద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించనున్నారు. ఇందులో కంగనా ర‌నౌత్ విక‌లాంగురాలి పాత్ర పోషిస్తుండ‌గా, ఆమెకు నిర్దేశకుడిగా అమితాబ్ న‌టించ‌బోతున్నాడు.

నిజానికి కంగనా ఎవ‌రెస్ట్ అధిరోహించిన విక‌లాంగురాలు అరుణిమ సిన్హా జీవిత‌క‌థ‌ ఆధారంగా రూపొందే చిత్రంలో కూడా కంగ‌నా న‌టించ‌బోతున్న‌ట్లు ఆమధ్య వార్త‌లు వ‌చ్చాయి. పర్హాన్ అక్తర్ ఆ చిత్రానికి డైరక్షన్ వహించే అవకాశం ఉందని చెప్పుకున్నారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. ఇక బాల్కీ చిత్రంలో నటించడం కోసం కంగ‌నా కొంత హోం వ‌ర్క్ చేయాల్సి ఉంది. వికలాంగురాలి పాత్ర కోసం రెండు నెలలు శిక్షణ తీసుకోబోతుందంట. ఈ శిక్ష‌ణ ఫర్హాన్ సినిమా కోసం పనికొస్తుందని ఆమె భావిస్తోందంట.

ఓ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన యువతి.. ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి కథాంశంగా ఈ చిత్రం ఉండబోతుందని చెబుతున్నారు. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక చిత్ర షూటింగ్‌లో, అమితాబ్ అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆర్ బాల్కీ డైరెక్ట్ చేసిన పాడ్ మాన్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles