Poor Collections for Sirish Okka Kshanam | మెగా హీరో.. మరీ ఇంత వీకా?

Okka kshanam weekend collections

Allu Sirish, Okka Kshanam, Director Vi Anand, Collections, Okka Kshanam Movie Collections, Okka Kshanam Movie Collections

Poor 1st Week Collections for Allu Sirish's Okka Kshanam Movie. Allu Sirsh is basking in the success of his recent release Okka Kshanam as the film is raking in decent moolah at the ticket window. The film has opened to mixed reviews from critics and the audience.

ఒక్క క్షణం కలెక్షన్లు.. శిరీష్ కు నిరాశ

Posted: 01/05/2018 05:10 PM IST
Okka kshanam weekend collections

వరుస ఫెయిల్యూర్స్ నుంచి ఆ మధ్య ఓ హిట్ కొట్టిన అల్లు శిరీష్ ఒక్క క్షణం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తో దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆడియన్స్ ను పలకరించాడు. ఆనంద్ గతంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చేయడం వలన, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సురభి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, ఒక రేంజ్ లో ప్రమోషన్స్ ను నిర్వహించారు కూడా.

కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేదని కలెక్షన్లను బట్టి తెలుస్తోంది. గతంలో శిరీష్ సినిమాలు ఇంతకంటే మెరుగ్గా వసూళ్లు రాబట్టం విశేషం. ఇంతకుముందు అల్లు శిరీష్ చేసిన 'కొత్తజంట' మొదటివారంలో 6 కోట్లను వసూలు చేస్తే, 'శ్రీరస్తు శుభమస్తు' 9 కోట్లను వసూలు చేసింది. 'ఒక్క క్షణం' ఆ వసూళ్లను అధిగమిస్తుందని అనుకున్నారు గానీ అలా జరగలేదు.

మొదటివారంలో ఈ సినిమా ఓవరాల్ గా 2.95 కోట్లను మాత్రమే రాబట్టిందని అంటున్నారు. థియేటర్స్ లో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'హలో' ఉండగా రావడమే ఈ సినిమా వసూళ్లు తగ్గడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఢిపరెంట్ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్ కు ఓ మంచి సినిమా చేశానన్న సంతృప్తి మాత్రమే మిగిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles