Tollywood Drugs Case Forensic Report Reached Court | డ్రగ్స్ కేసు.. కోర్టుకు చేరిన ఫోరెన్సిక్ రిపోర్ట్.. ఆ ఒక్కరిని అరెస్ట్ చేయక తప్పదా?

Tollywood drugs case forensic report

Tollywood, Drugs Case, Forensic Report, Telangana Excise Department, High Court, Special Investigation Team(SIT), Tollywood Drugs Case

Tollywood Celebrities Drugs Allegations. Forensic Lab Report Submitted to High Court. SIT Ready to file Charge Sheet.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కోర్టుకు చేరిన ఫోరెన్సిక్ రిపోర్ట్

Posted: 12/20/2017 03:47 PM IST
Tollywood drugs case forensic report

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. సంచలనం రేపిన డ్రగ్ కేసు నీరుగారుతోందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. సాంకేతికంగా ఎవరూ తప్పుపట్టకుండా నమూనాలను రెండోసారి కూడా ఐఐసీటీ విశ్లేషణకు పంపడం వల్ల మొత్తం ప్రక్రియ ఆలస్యమైందని అంటున్నారు.

ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోర్టుకు దరఖాస్తు చేసి ఆ నివేదికను తీసుకోవాలి. ఆపైన దాని ఆధారంగా సిట్ తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. అందులో ఒకరి దాంట్లో పాజిటివ్ వచ్చిందని సమాచారం అందుతోంది. ఫోరెన్సిక్‌ నివేదిక అందిన తర్వాత సిట్‌ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు. అవసరమైతే ఆ సెలబ్రిటీని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.

వంద నుంచి 200 పేజీలతో అభియోగ నమోదు పత్రాలను ఎక్సైజ్ శాఖ నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం 12 మంది నుంచి ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం సంగతి తెలిసిందే. రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, తరుణ్, సుబ్బరాజు, చార్మి, ముమైత్ ఖాన్, నందు తదితరులు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles