Pulimurugan Only Indian film on Oscar Original Songs list | పులిమురుగన్(మన్యం పులి) చిత్రానికి అరుదైన ఘనత

Pulimurugan songs in oscar race

Pulimurugan, Oscar 2018, Mohanlal, Academy of Motion Picture Arts and Sciences, Original Songs list, Kaadanayum Kaalchilambe, Maanathe Maarikurumbe, Pulimurugan Songs Oscar Race

Mohanlal's Pulimurugan in Oscar race, only Indian film on 'Original Songs' list. The songs composed by Gopi Sunder. The Academy of Motion Picture Arts and Sciences announced the list on Monday which features 'Kaadanayum Kaalchilambe' and 'Maanathe Maarikurumbe'.

ఆస్కార్ బరిలో పులిమురుగన్ పాటలు

Posted: 12/19/2017 04:44 PM IST
Pulimurugan songs in oscar race

మళయాళ బ్లాక్ బస్టర్ మూవీ పులి మురుగన్(తెలుగులో మన్యం పులి) అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ బరిలో ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఈ చిత్రానికి చెందిన రెండు పాటలు జాబితాలో చోటు దక్కించుకుంది. నామినేషన్ కోసం పోటీ ప‌డుతున్న 70 పాట‌ల జాబితాను ది అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది.

ఇందులో రెండు భారతీయ చిత్రానికి చెందిన సాంగ్స్ ఉండగా.. అవి రెండూ మోహన్ లాల్ నటించిన 'పులిమురుగ‌న్‌' లోనివే. 'క‌డాయానం క‌ల్చిలంబే', 'మాన‌దే మారికురుంబే' పాట‌లు ఈ జాబితాలో ఉన్నాయి. మొద‌టి పాట‌ను చిత్ర‌, యేసుదాసు ఆలపించ‌గా, రెండో పాట‌ను వాణీ జ‌య‌రాం పాడారు. ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ మొత్తం జాబితాలో 'కాల్ మీ బై యువ‌ర్ నేమ్', 'కోకో', 'బ్యూటీ అండ్ ద బీస్ట్‌', 'మ‌డ్‌బౌండ్' చిత్రాల్లోని పాట‌లు నామినేట్ అవుతాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంకా ఈ జాబితాలో దిగ్గ‌జ గాయ‌కులు టేల‌ర్ స్విఫ్ట్‌, మ‌రియా కారే, నిక్ జోన‌స్‌లు పాడిన పాట‌లు కూడా ఉన్నాయి. నామినేట్ అయిన పాట‌ల జాబితాను జ‌న‌వరి 23న ప్ర‌క‌టించ‌నున్నారు. మళయాళంలో పులిమురగన్ వంద కోట్లు రాబట్టిన తొలిచిత్రంగా రికార్డు సాధించింది. ఇందులో మోహన్ లాల్ సరసన కమిలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించగా.. జగపతి బాబు విలన్ గా కనిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles