Nag Balayya Nara Narayana May not Possible | నాగ్-బాలయ్య.. నర నారాయణ... అయ్యే పనికాదు!

Nara narayana movie updates

Nagarjuna Akkineni, Nandamuri Balakrishna, Nagarjuna Balakrishna, Nara Narayana Movie, Nag Balayya Multi Starrer, Nagarjuna Movie

Nagarjuna Akkineni Nandamuri Balakrishna Multi Starrer Nara Narayana Movie again in News. But, The Plans not work out as soon as possible.

టాలీవుడ్ లో నరనారాయణ.. నిజమేనా?

Posted: 12/11/2017 06:45 PM IST
Nara narayana movie updates

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతున్నాయి. చాలా కాలం నుంచి పెండింగ్ లో పడిపోయిన పౌరాణిక చిత్రం ‘నరనారాయణ’ తిరిగి కదిలిందని. పైగా అది ఇద్దరు అగ్రహీరోలతో అని..

నవావధాని మీగడ రామలింగస్వామి. కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా నాగార్జున హీరోలుగా, నర నారాయణుల బంధం కథాంశంగా ‘నరనారాయణ’ చిత్రానికి తాను ఇప్పటికే స్క్రిప్టును సిద్ధం చేశానని, దీని గురించి ఇటీవలే తనను పిలిపించిన బాలయ్య, వివరాలు తీసుకున్నారని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామలింగస్వామి వెల్లడించారు. నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణల కోసం ఈ స్క్రిప్టును రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని తెలిపారు.

మొన్నీ మధ్య ప్రాజెక్టును గురించి బాలయ్యకు వివరించానని అన్నారు. గతంలో సినిమాల్లో నటించే అవకాశం లభించినా కుదర్లేదని రామలింగస్వామి వెల్లడించారు. అయితే తమ మధ్య వైషమ్యాలు లేవని ఈ ఇద్దరూ ప్రకటించినప్పటికీ.. చైతూ పెళ్లి వేడుకలో బాలయ్య మిస్ కావటంతో అదంతా కేవలం మీడియాను ఊరడించేందుకే అని చెబుతున్నారు. ఇక దానిని తెరకెక్కించేందుకు పుండరీకాక్షయ్య కూడా లేరు. సో.. ఈ ప్రాజెక్టు తెరకెక్కటం అయ్యే పని కాదన్నది వాస్తవం.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles