Actress Successfully Run Congress Social Media Campaign | కాంగ్రెస్ లో కన్నడ నటి దూకుడు.. రాహుల్ నమ్మకం వమ్ము కాలేదు

Actress handling congress s social media division

Actress Divya Spandana, Congress Party, Rahul Gandhi Congress Party, Rahul Gandhi Social Media Incharge, Actress INC Social Media, Social Media & Digital Communications AICC

Actress Divya transformed Congress’s social media division. Congress brought lady actress Divya Alias ​​Ramya. Rahul Gandhi gave full freedom to her and she formed the group and this group has 85 women. The digital media war room was also set up in the social media division. BJP now getting all the counter calls and retaliations from this division of the Congress party in the social media. Divya has been successful so far in her job of handling Congress’s social media division proving Rahul Gandhi’s choice is not wrong.

కన్నడ నటి రమ్య సూపర్ సక్సెస్

Posted: 12/05/2017 01:21 PM IST
Actress handling congress s social media division

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోసారి సినీ గ్లామర్ ను వాడుకునేందుకు పార్టీలు సిద్ధమైపోతున్నాయ్. ఈ క్రమంలో కన్నడ నాట క్రేజ్ ఉన్న నటి రమ్య అలియస్ దివ్య స్పందనకు అప్పగించిన కీలక బాధ్యతల గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రమ్య కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 85 మందితో ఓ గ్రూప్ ను ప్రారంభించి విరివిగా ప్రచారం ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు డిజిటల్ మీడియా వార్ రూమ్ ను ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం బీజేపీకి యాంటీగా సోషల్ మీడియాలో పడుతున్న సైటైర్లు, పంచులు ఈమె ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నవే. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే కాంట్రవర్సీ కాకుండా వాటిని రూపొందించటంలో ఆమె సక్సెస్ అవుతుందని అధిష్ఠానం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. పైగా ఇప్పుడు రాహుల్ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించబోయే సమయంలో ఆమె మరింత సమర్థవంతంగా క్యాంపెయిన్ నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

మొత్తానికి దిపుందెరింగ్ హుడా ను తప్పించి అతని స్థానంలో రమ్యను దించటం.. ఆమె విజయవంతగా దూసుకుపోతుండటంతో రాహుల్ ఛాయిస్ ఫర్ ఫెక్ట్ అని ఇప్పుడు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles