Dhanush's Hollywood Movie First look poster out | ధనుష్ ఇంటర్నేషనల్ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్

Dhanush new movie first look

Dhanush, Dhanush Hollywood Movie, Dhanush Hollywood First look, Dhanush Movie Poster, Dhanush Movie Poster, Berenice Bejo Dhanush, Dhanush International Movie, The Extraordinary Journey of The Fakir Movie, The Extraordinary Journey of The Fakir Poster

First look of Dhanush's international film The Extraordinary Journey of The Fakir will pique your interest. Dhanush's Hollywood Debut With Berenice Bejo.

ధనుష్ హాలీవుడ్ ఫస్ట్ లుక్ విడుదల

Posted: 11/02/2017 03:56 PM IST
Dhanush new movie first look

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కు వలసలు కొత్తేం కాదు. అయితే హీరోయిన్ల సంగతి ఎలా ఉన్నా.. హీరోలు మాత్రం పూర్తి స్థాయి హీరోలుగా రాణించలేకపోయారనే చెప్పొచ్చు. బాలీవుడ్ లో ఓంపురి, నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్, ఇర్ఫాన్ ఖాన్, అనిల్ కపూర్ ఇలా అంతా గెస్ట్ రోల్స్ లో కనిపించిన వారే.

ఇలాంటి టైంలో త‌మిళ న‌టుడు ధ‌నుష్ మాత్రం డెబ్యూలోనే హాలీవుడ్ హీరోగా మారిపోయాడు. 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌' చిత్రంలో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ మంగ‌ళ‌వారం విడుద‌లైంది. త‌ల్లి చ‌నిపోయాక తండ్రి కోసం వెతుకుతూ దేశాలు తిరిగే ఫ‌కీర్ పాత్ర‌లో ధ‌నుష్ క‌నిపించ‌నున్నాడు. రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌' పుస్త‌కం ఆధారంగా ద‌ర్శ‌కుడు కెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ముంబై, బ్రుస్సెల్స్ (బెల్జియం), రోమ్ (ఇట‌లీ), పారిస్ (ఫ్రాన్స్‌) ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ చేశారు. బెరెనీస్ బెజో ధనుష్ కు జోడీగా నటిస్తోంది. ఇందులో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల‌కు చెందిన‌వారు కావ‌డంతో చాలా వైవిధ్య‌త క‌నిపిస్తుంద‌ని కెన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles