Rangasthalam Gets New Release Date | రంగస్థల రిలీజ్ డేట్?.. ఆ తేదీ వేరే చిత్రాలు లేవని ఫిక్స్ అయ్యారంట!

Rangastalam new release date

Rangasthalam 1985, Rangasthalam Movie Release Date, Rangasthalam Sukumar, Rangasthalam Sukumar, Rangasthalam Mytri Movie Makers, Ram Charan Rangasthalam, Ram Charan Rangasthalam Release Date

Ram Charan Rangasthalam Release Date Fixed? Mytri Movie Makers fixes new release date on March 29. Rangasthalam 1985 Directed by Sukumar.

రంగస్థలం రిలీజ్ డేట్ ఫిక్స్?

Posted: 11/01/2017 12:14 PM IST
Rangastalam new release date

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 కోసం రిలీజ్ తేదీ ఫిక్సయ్యిందన్న ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి నుంచి అవుట్ అయిన ఈ చిత్రం సమ్మర్ కి పోస్ట్ పోయ్యిందన్న విషయం తెలిసిందే. లెక్కల మాష్టార్ సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్ డేట్స్ గురించి అంతా ఆసక్తిని చూపుతున్నారు. గోదావరి జిల్లాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన ఈ సినిమా టీమ్, హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేశారు. ప్రస్తుతం చెర్రీ ఫ్యామిలీతో రెస్ట్ తీసుకుంటున్నాడు.

తాజాగా చెబుతున్న డేట్ ఏంటంటే... మార్చి 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. దాదాపు ఇదే తేదీ ఖరారు కావొచ్చని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కనువిందు చేయనుంది. మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles