Nag Don't Knows about Samantha's Character | నాగ్ గురించి సమంతకు తెలుసు.. కానీ, నాగ్ కు మాత్రం తెలీదు

Ohmkkar about nag and samantha

Raju Gari Gadhi 2, Nagarjuna Akkineni, Samantha, Director Ohmkkar, Nag Samantha Ghost Role

Director Ohmkhar Reveals intresting things about Raju Gari Gadhi 2. Samantha Knows about Nagarjuna's Role. But, Nag don't knows.

నాగ్, సమంతల గురించి ఓంకార్

Posted: 10/09/2017 04:30 PM IST
Ohmkkar about nag and samantha

రాజుగారి గది-2 లో నాగార్జున, సమంత పాత్రలే సినిమాకు హైలెట్ అవుతాయని దర్శకుడు ఓంకార్ చెబుతున్నాడు.రాజు గారి గది 2 చిత్రం ఈ నెల 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓంకార్ వారి పాత్రల గురించి చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాడు.

అయితే ఆత్మ పాత్రలో సమంత నటిస్తున్న విషయం నాగార్జునకు ముందుగా తెలియదని.. షూటింగ్ లో జాయిన్ అయ్యే ముందే ఆయనకు తెలిసిందని ఈ చిత్ర దర్శకుడు ఓంకార్ అన్నారు. తాను రాసుకున్న కథలో ముందు నాగార్జునను తీసుకున్నాం. ఆ తర్వాతే అంటే ఓ నెల రోజుల తర్వాత సమంత వచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నట్టు సమంతకు తెలుసని ఓంకార్ చెప్పాడు. ‘రాజు గారి గది 2’లో ఆత్మ క్యారెక్టర్ లో సమంత నటన అద్భుతమని, ఆమె కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో నాగార్జున, సమంత నటన అందరినీ ఆకట్టుకుంటుందని,ధీమాతో ఉన్నాడు.

రాజు గారి గదిలాగే సీక్వెల్ రాజు గారి గది 2లో కూడా మెస్సేజ్ ఉంటుందని తెలిపాడు. మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించాలనేదే ఈ చిత్రంలో మెస్సేజ్ అని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ధూమ్ సిరీస్ ఏ విధంగా విజయవంతమైందో, ‘రాజుగారి గది’ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందని ధీమాగా చెప్పారు. ఈ సిరీస్ లో రాజుగారి గది 3, 4 కూడా ఉంటాయని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles