Pawan Music Bit Better Than SPYder and Lavakusa Tracks

Pawan music bit create sensation

Pawan kalyan, 25th Movie, Trivikram, Music Bit, Anirudh Ravichandran, Jai Lava Kusa, SPYder, Audio Review

Pawan kalyan Music Bit Create Sensation in Social Media. SPYder and Jai Lava Kusa not Impressive.

పవన్ మ్యూజిక్ బిట్ మీదే అందరి దృష్టి

Posted: 09/07/2017 05:50 PM IST
Pawan music bit create sensation

ఓ చిత్ర విజయంలో మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు హిట్ ట్రాక్స్ ఉన్నా.. కనీసం యావరేజ్ పాటలున్నా సరే కథ బలంగా ఉంటే చిత్రం హిట్ అయి తీరుతున్న రోజులివి. అయితే కథ బాగోలేకపోయినా జస్ట్ పాటలతో మ్యూజిక్ హిట్లుగా మారిన సినిమాలు ఉన్న సంగతి మరిచిపోవద్దు. అయితే త్వరలో రానున్న స్టార్ సినిమాల్లో వీక్ పాటలు ఆయా హీరోల ఫ్యాన్స్ ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

అందులో మొదటగా జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ గురించి చెప్పుకోవాలి. మాములుగా ఎమోషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ లకు, టైటిల్ సాంగ్ లకు మ్యూజిక్ అందించటంలో దేవీశ్రీ ప్రసాద్ ఆరితేరి ఉన్నాడు. జై క్యారెక్టర్ టీజర్ సమయంలో ఆ ఫ్లస్ పాయింట్ మ్యూజిక్ ఆల్బమ్ పై అంచనాలు పెంచింది. పైగా ఇద్దరి కాంబోలో వచ్చిన లాస్ట్ టూ సినిమాల పాటలు కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యాయి. అయితే ఇప్పడు లవకుశ విషయానికొచ్చే సరికి ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్క టైటిల్ సాంగ్(అది కూడా దేవీ పాత పాటల్లాగే ఉందన్న కంప్లైంట్ ఉంది) మిగతా పాటలేవీ పెద్దగా రిజిస్ట్రర్ కాలేకపోయాయి. దీంతో సినిమాపై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక రెండోది మహేష్ బాబు స్పైడర్ చిత్రం. ఇప్పటికే సగం తమిళ సినిమా మార్క్ పడ్డప్పటికీ కనీసం పాటలతోనైనా హ్యారిస్ జైరాజ్ సర్దిపుచ్చుతాడనుకుంటే అదీ కాలేదు. పైగా రిలీజ్ అయిన రెండు పాటలు కూడా అరవ వాసనతోనే ట్రెండ్ అవుతున్నాయి. పోనీ.. తమిళ్ లో అయినా హిట్ అయ్యాయా? అంటే అక్కడి జనాలకు అస్సలు ఎక్కలేదు. అసలే భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం.. పైగా ఏడాదిన్నర కష్టం... ఈ నేపథ్యంలో మహేష్ అభిమానుల్లోనూ చిన్న కలవరపాటు మొదలైంది.

అయితే ఈ చిత్రాలకు కాస్త గ్యాప్ తోనే రిలీజ్ కానుకున్న పవన్ కళ్యాణ్ 25వ చిత్రం మాత్రం చిన్న బీట్ తోనే అంచనాలను అమాంతం పెంచేసుకుంది. అనిరుధ్ లాంటి కోలీవుడ్ యువ సంగీత దర్శకుడిని చిత్రానికి ఎంపిక చేయటం ద్వారా ఫ్రెష్ ఆల్బమ్ ను అందించటంతోపాటు యూత్ ను బాగా ఆకట్టుకునేలా ఆల్బమ్ ను తీర్చిదిద్దబోతున్నాడంట. ఈ నేపథ్యంలో పాటలు ఖచ్ఛితంగా బాగుంటాయనే చెప్పుకుంటున్నారు. అఫ్ కోర్స్ పూర్తి ట్రాక్స్ ఇంకా బయటకు రాకముందే నిర్ణయయించటం కరెక్ట్ కాకపోయినా, వీళ్లిద్దరి కాంబో గత చిత్రాల ట్రాక్ ను పరిగణనలోకి తీసుకుని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ పవన్-త్రివిక్రమ్ కాంబోలో కథలు కూడా బాగుంటాయనే నమ్మకం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Simran and nawazuddin siddiqui join rajinikanth s upcoming film

  ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ స్టార్ సరసన సిమ్రాన్..

  Jul 19 | తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా వెండితెరను ఏలిన సిమ్రాన్ అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమల్లోని అగ్రహీరోలు మొదలుకుని యువ కథానాయకుల వరకు అందరితో నటించి.. మెప్పించింది. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ,... Read more

 • Ramya krishnan wraps up shoot for shailaja reddy alludu

  శైలజారెడ్డి అల్లుడికి ఫ్యాకఫ్ చెప్పిన రమ్యకృష్ణ..

  Jul 19 | బాహుబలి చిత్రంలో తన నటనతో అఖిలభారత ప్రేక్షకులను రంజింపజేసి.. మన్ననలు పోందిన రమ్యకృష్ణకు.. ఇక టీవీ సిరియళ్లుకు ఫుల్ స్టాప్ పెట్టి.. పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించేలా వచ్చేశాయట ఆఫర్లు. ప్రస్తుతం అమె మారుతి... Read more

 • Curtains raised for geetha govindam teaser

  గీతా గోవిందం టీజర్ రిలీజ్ అదే రోజున

  Jul 19 | అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో 'గీత గోవిందం' అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.... Read more

 • Traditionally captivating srinivasa kalyanam concept teaser

  ‘శ్రీనివాస కళ్యాణం’ కాన్సెప్ట్ టీజర్ విడుదల

  Jul 19 | వరుసగా చల్ మోహనరంగా, లై చిత్రాలు బాక్సాఫీసు వద్ద అపజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో తెలుగు సంప్రదాయంతో పెళ్లి కాన్సెప్టుతో అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు ఇటు యూత్ ను అకట్టుకునే విధంగా కొత్త కథనంతో... Read more

 • Rx100 first week box office collections report

  'ఆర్ ఎక్స్ 100' సినిమా కలెక్షన్లు అదుర్స్..!

  Jul 19 | యూత్ కి నచ్చితే .. మాస్ ఆడియన్స్ మెచ్చితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందనే విషయాన్ని 'ఆర్ ఎక్స్ 100' మరోసారి నిరూపించింది. ప్రేమకి యాక్షన్ .. ఎమోషన్ కలిస్తే అది... Read more

Today on Telugu Wishesh