Malayalam Young Actress in Balayya 102 Movie

Two more heroines in balayya 102

Natasha Doshi, Tollywood Debut, Balakrishna 102 Movie, KS Ravi Kumar, Balayya 102 Movie,

Malayalam Talented Beauty for Balakrishna 102 Movie. Beside Nayanatara actress Natasha Doshi has been roped in for another heroine.

బాలయ్య 102లో మరో ఇద్దరు హీరోయిన్లు

Posted: 09/04/2017 04:13 PM IST
Two more heroines in balayya 102

నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ థియేటర్లలో సందడి చేస్తుండగానే.. మరోవైపు 102వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దర్శకుడు కె. ఎస్. రవికుమార్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకున్నారు. ఆల్రెడీ ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొంటోంది. ఇక రెండవ కథానాయికగా 'నటాషా దోషి'ని ఎంపిక చేసినట్టుగా సమాచారం. కథానాయికగా నటాషా దోషికి మలయాళంలో మంచి గుర్తింపు వుంది. హైడ్ అండ్ సీక్, మాంత్రికన్, నయన చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఈ నేపథ్యంలోనే ఆమె బాలకృష్ణ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. ఇక మూడవ కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. జయసింహా అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రం సమ్మర్ బరిలో నిలవనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles