సాహోలో ఛాన్స్ అందుకే వదిలేశాడంట.. | Aravind Swamy Miss Chance in Saaho

Aravind swamy miss saaho

Aravind Swamy, Aravind Swamy Saaho, Aravind Swamy Saaho Offer, Aravind Swamy New Movie, Prabhas Saaho

Actor Aravind Swamy Miss Chance in Prabhas's Sahoo. Due to Serial Commitments he not adjusted Dates and nil Nitin mukesh Get the Opportunity.

సాహోను అరవింద స్వామి ఎలా మిస్సయ్యాడు?

Posted: 08/31/2017 06:48 PM IST
Aravind swamy miss saaho

ప్ర‌భాస్ హీరోగా తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం `సాహో`. హై ప్రోఫైల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఇందులో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఉన్న మూడు ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో ఒక‌దాని కోసం అర‌వింద్ స్వామిని అనుకున్నార‌ట ద‌ర్శ‌కుడు సుజీత్ రెడ్డి. త‌మిళ‌, తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కు అర‌వింద్ స్వామి ప‌రిచ‌య‌ముండ‌టంతో ఆయ‌నైతేనే బాగుంటుంద‌ని సుజీత్ నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ఈ విష‌యంపై చిత్ర‌బృందం అర‌వింద్ స్వామిని క‌ల‌వ‌గా డేట్లు ఖాళీ లేక‌పోవ‌డంతో ఆయ‌న ఒప్పుకోలేద‌ని స‌మాచారం. అయితే అదే స్థానాన్ని ప్ర‌భాస్ చ‌రిష్మాకు స‌రితూగేలా ఉండేందుకు బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముకేష్‌తో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.

సాహోలో నీల్ నితిన్ ముకేశ్‌తో పాటు జాకీ ష్రాఫ్‌, చంకీ పాండే, మందిరా బేడీలు ప్ర‌తినాయ‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హీరోయిన్‌గా శ్ర‌ద్ధా క‌పూర్‌ను ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. మరో కీలక పాత్రలో తమిళ నటుడు అరుణ్ విజయ్ కనిపించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aravind Swamy  Saaho Movie  Prabhas  

Other Articles