ఎన్టీఆర్ జైలవకువ రెండో టీజర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మూడు పాత్రల్లో జై పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా, దానికి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా తారక్ రావణ డైలాగ్ కు విజిల్స్ వేశారు. దీంతో మిగతా టీజర్ల గురించి యంగ్ టైగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇక లవ పాత్రకు సంబంధించిన టీజర్ అఫీషియల డేట్ వచ్చేసింది. ఆగష్టు 7 రాఖీ పండగ సందర్భంగా రెండో టీజర్ ను రిలీజ్ చేస్తామని నిర్మాత కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు. ఉదయం 10.35కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చెప్పేశాడు. లవకుమార్ పేరుతో ఆ రోల్ ఉండబోతుందనే విషయం తెలిసిందే. అయితే అది టీజర్ తోనేనా? లేక పోస్టర్ లాంటిది ఏదైనా వదులుతాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
You witnessed the mighty Jai. Now get ready to welcome @tarak9999 as Lava Kumar on August 7th at 10:35am. #LavaFLonRakhi pic.twitter.com/0sZiGFz9ms
— NTR Arts (@NTRArtsOfficial) August 3, 2017
పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్న జైలవకుశలో పోసాని ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, నివేథా థామస్, రాశీఖన్నా, నందితారాజ్ లు హీరోయిన్టుగా నటిస్తున్నారు. అన్నీ కరెక్ట్ గా జరిగితే సెప్టెంబర్ 21న సినిమా విడుదలయ్యే ఛాన్సుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more