Rajini Dhanush Multi Starrer not Possible

No multi starrer from rajinkanth and dhanush

Rajinikanth, Rajinikanth Dhanush, Dhanush Father in Law, Rajinikanth Dhanush Multi Starrer, Rajinikanth Dhanush Movie, Rajinikanth Skip VIP 2, VIP 2 Rajinikanth, Rajinikanth Not Act with Dhanush, Superstar Not Interested with Dhanush, Dhanush Multi Starrer, Rajinikanth Son in Law Differences, rajinikanth Dhanush Not Well

Is a multi-starrer with Super Star Rajinikanth and Son in Law Dhanush Possible. Besides the professional reasons, there are rumours making rounds that everything isn’t well between Rajnikanth and his son-in-law. Their combination is highly unlikely even in the future because of some unrevealed personal reasons.

మాపిళ్లై తో మల్టీస్టారర్ చేయడా?.. గొడవ ఎందుకు?

Posted: 07/03/2017 06:36 PM IST
No multi starrer from rajinkanth and dhanush

మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో ఓ సినిమా రాబోతుంది అనగానే అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే అంచనాలు గాల్లో ఉంటాయి. అదే ఓ పిచ్చ పాపులారిటీ ఉన్న యంగస్టర్ తో ఓ లెజెండరీ హీరో చేస్తే... విజయ్ జిల్లా, తారక్ జనతా గ్యారేజ్ లే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇవేగాక పరభాష నటులే కాదు రాజేంద్రప్రసాద్, జగపతిబాబు లాంటి వాళ్లు సీనియర్ హీరోల కాంబోలో వస్తున్న సినిమాలు కూడా ఇదే రేంజ్ లో హిట్లుగా మారుతున్నాయి.

అయితే ఒకే ఇంట్లో ఉన్న హీరోలు మల్టీ స్టారర్ కు మోజు చూపించకపోవటంపై మాత్రం సహజంగానే డౌట్లు మొదలవుతుంటాయి. ఛాన్స్ దొరికితే చాలూ ఎప్పుడెప్పుడు నటించేద్దామని ఊవ్విళ్లూరుతున్న టైంలో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో ధనుష్ సినిమా ఎందుకు చేయడు అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

దీనికి ప్రశ్నలోనే ఆన్సర్ కూడా వెతుక్కుంటున్నారు కొందరు. నిజానికి పవర్ పాండియన్ చిత్రం ముందు రజనీతో తీయాలని ధనుష్ ఫ్లాన్ చేశాడు. కానీ, అది కుదరక రాజ్ కుమార్ తో కానిచ్చేశారు. ఆపై వీఐపీ 2 లో కాజోల్ రోల్ కూడా రజనీ తోనే చేయించాలని భావించారంట. ఈ విషయాన్ని చిత్ర దర్శకురాలు సౌందర్యనే స్వయంగా వెల్లడించటం ఇక్కడ విశేషం. ఇప్పుడు కాలా ను నిర్మాతగా చేస్తున్నాడనే తప్ప, అందులో నటించే అవకాశం ధనుష్ కి వచ్చినా వదిలేసుకున్నాడన్న టాక్ బయలుదేరింది. దీంతో సహజంగానే అనుమానాలు మొదలయ్యాయి.

ప్రోఫెషనల్ గా ఈ మామ అల్లుళ్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం దూరం ఉంటారనే టాక్ ఉంది. రాజకీయాల్లోకి రావాలనుకున్న టైంలోనే ధనుష్ పెరెంట్స్ వ్యవహారం, ఆపై సుచీ లీక్స్ నేపథ్యంలో కావాలనే మాపిళ్లైని(అల్లుడు) సాధ్యమైనంత దూరం రజనీ పెట్టాడనే అప్పట్లో తీవ్రంగా చర్చించుకున్నారు. అయినప్పటికీ కూతురు కోసం తలైవా అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతూనే ఉంటాడని చెప్పుకుంటుంటారు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వీరి మధ్య ఆ విభేధాలు తొలగి ఓ చిత్రం రావాలనే కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Dhanush  Rajinikanth  Multi Starrer  

Other Articles