Block Buster Here Disaster at Overseas

Dj movie first week collections report

Duvvada Jagannadham, DJ Weekend Collections, DJ Disaster, DJ Movie Final Verdict, Duvvada Jagannadham Movie, DJ Movie Collections, Allu Arjun Duvvada Jagannadham Result, Allu Arjun DJ Collections, DJ 100 Crores Club

Duvvada Jagannadham Collections Weekend Report. Block Buster for Telugu States Disaster at Overseas.

డీజే సేమ్ సీన్ రిపీట్.. భారీ డిజాస్టర్ అయినట్లేనా?

Posted: 07/01/2017 04:15 PM IST
Dj movie first week collections report

ఎట్టకేలకు స్టైలిష్ స్టార్ దువ్వాడ జగన్నాథమ్ ఓవరాల్ కలెక్షన్లు వంద కోట్ల కలెక్షన్లను(గ్రాస్) దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు అఫీషియల్ గానే అనౌన్స్ చేసేశాడు. అదే సమయంలో ఓవర్సీస్ లో కూడా వన్ మిలియన్ మార్క్ ను టచ్ చేసేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో దంచినప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం డల్ కలెక్షన్లు రాబడుతోంది. ఓపెనింగ్ డే(ప్రీమియర్ షోలతో) కలిపి హాఫ్ మిలియన్ మార్క్ సాధించగా, మిగతా ఆరు రోజుల్లో మళ్లీ హాఫ్ మిలియన్ మార్క్ సాధించేసింది.

తెలుగుతో పాటు మళయాళంలోనూ తెగ క్రేజ్ సంపాదించుకున్న బన్నీ అక్కడి ఫ్యాన్స్ ను మాత్రం ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అల్లు అర్జున్ సినిమాల్లో వన్ మిలియన్ మార్క్
చేరుకున్న సినిమాల్లో డీజే మూడోది. ఇంతకు ముందు రేసుగుర్రం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఈ మార్క్ చేరుకున్నాయి. అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన సరైనోడు మన దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టగా ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది.

డీజే సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ. 9 కోట్ల వరకు పలికిందని టాక్. ఈ లెక్కన మిలియన్ డాలర్లు వసూలు చేసినా ఇంకా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి లేదు. ఎంత గట్టిగా ప్రమోట్ చేసినా కలెక్షన్లు ఇంక పుంజుకునే అవకాశం లేదు. దీంతో ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ కు భారీ లాస్ తప్పదనే చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagannadham  Weekend Collections  Overseas  

Other Articles