Nani Ninnu Kori Teaser Released and Review

Ninnu kori teaser out

Nani Ninnu Kori, Ninnu Kori Teaser, Nani Ninnu Kori, Ninnu Kori Teaser, Ninnu Kori Teaser Review, Ninnu Kori Review, Nani Stylish Avatar, Ninnu Kori Abhinandana, Abhinandana Nani Remake Ninnu Kori Remake, Nani Ninnu Kori Review

Nani Ninnu Kori Movie Teaser Released. The triangle love story teaser looking promising.

నిన్ను కోరి టీజర్.. ఆ క్లాసిక్ రీమేకా?

Posted: 06/09/2017 11:45 AM IST
Ninnu kori teaser out

టైమింగ్ పంచ్ లలో నేచురల్ స్టార్ నాని మరోసారి తనని తాను నిరూపించుకున్నాడు. కొత్త చిత్రం నిన్ను కోరి టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ఇందులో నాని పేల్చిన డైలాగ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ''ఈ అమ్మాయిలు అస్సలు అర్ధంకారు. అన్ని అలవాట్లూ ఉన్నోడిని ప్రేమిస్తారు. ఏ అలవాటు లేని వాడిని పెళ్ళి చేసుకుంటారు'' అంటూ డైలాగ్ పేల్చాడు.

నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరక్షన్లో రూపొందుతున్న ''నిన్ను కోరి'' ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరి అన్నది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. బ్యూటీఫుల్ లోకేషన్లలో కెమెరా వర్క్ తో పాటు గోపిసుందర్ ఇచ్చిన స్ర్టింగ్స్ మ్యూజిక్ నేపథ్యంలో భలేగా ఉంది. లుక్స్ పరంగా కూడా నాని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అడిగా సాంగ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంది.

 

సినిమా కథ ప్రేమ ఒకరితో.. పెళ్లి ఒకరితోనే అనే కాన్సెప్ట్ అని తెలుస్తుండగా, టాలీవుడ్ క్లాసిక్ మూవీ అభినందన సినిమా కు ఎంటర్ టైన్ మెంట్ ను జోడించి రీమేక్ చేసి ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా వరుసగా హిట్లతో దూసుకుపోతున్న నాని మరోసారి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతోనే రాబోతున్నాడన్నది మాత్రం టీజర్ తో అర్థమైపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Nani  Ninnu Kori Movie  Teaser Review  

Other Articles