Rana Joins 'Aasphota' Movie In Key Role

Rana in rajiv gandhi assassination movie

Rajiv Gandhi, Rajiv Gandhi Assassination, Aasphota The Human Bomb, Rana CBI Officer, Rana Aasphota Movie, Hero Rana, Rana Kannada Movie, Rana Kannada Debut, Daggubati Rana New Movie, CBI Officer Suresh, Rana as Suresh, Rana Ravi Kaale

Rana to play CBI officer in film about Rajiv Gandhi Assassination Movie Aasphota The Human Bomb. Kannada Maker AMR Ramesh Direct that Project.

రాజీవ్ గాంధీ మూవీలో రానా

Posted: 05/15/2017 02:33 PM IST
Rana in rajiv gandhi assassination movie

సౌత్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్టు ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ ను తాకబోతుంది. గతంలో వీరప్పన్ అట్టహాసా, సైనెడ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన కన్నడ ఫిల్మ్ మేకర్ ఏఎంఆర్ రమేష్ మరో ప్రయోగానికి సిద్ధమైపోయాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో ఓ సినిమాను రూపొందించేందుకు సిద్ధమైపోయాడు. నిజానికి గతేడాదే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసినప్పటికీ, పక్కా స్క్రిప్ట్ రెడీ కావటానికి, కాస్టింగ్ ఎంపికకు ఇంత టైం పట్టింది.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ రానా కీ రోల్ పోషించబోతున్నాడు. రాజీవ్ కేసును డీల్ చేసిన సీబీఐ ఆఫీసర్ డాక్టర్ కార్తీకేయన్ రోల్ లో ఈ దగ్గుబాటి హీరో మెరవనున్నాడు. బాహుబలి, ఘాజీ లతో నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన రానాను నటింపజేయటం, మిగతా భాషల్లో కూడా సినిమాను హిందీ, తెలుగు, తమిళ్, కన్నడలో ఒకేసారి రిలీజ్ చేయాలన్న ఫ్లాన్ తో సిద్ధంగా ఉన్నాడు రమేష్. అయితే సైనెడ్ లోనే రాజీవ్ హత్య నేపథ్యం చూపించటం, బాలీవుడ్ లో ఇంతకు ముందే జాన్ అబ్రహం హీరోగా మధ్రాస్ కేఫ్ అనే సినిమా ఇదే ఉదంతంతో రావటంతో రమేష్ కొత్తగా ఏం చూపించబోతున్నాడా? అన్న ఆసక్తి నెలకొంది.

అస్ఫోటా-ది హ్యుమన్ బాంబ్ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో రవి కాలే శ్రీనివాసన్ పాత్రలో మెరవనున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Rana  Aasphota The Human Bomb  Kannada Movie  

Other Articles