Actress Sudha Shocking Comments on Tollywood.

Actress sudha shocking comments on tollywood

Senior Actress Sudha, Sudha Tollywood, Tollywood Actress Sudha, Senior Actress Tollywood, Sudha Shocking Comments, Sudha Movies, Sudha Nagarjuna Relation, Sudha Uday Kiran, Uday Kiran Sudha, Sudha Shocking Comments, Sudha Interview, Sudha Mother Roles, Sudha Nadia, Sudha Pragathi

Senior Actress Sudha shocking Comments on Tollywood. Nowadays there is no priority to mother roles in star heros movie. That is the reason she quit movies.

టాలీవుడ్ పై సుధ సంచలన వ్యాఖ్యలు

Posted: 04/27/2017 04:34 PM IST
Actress sudha shocking comments on tollywood

తెలుగులో ఒకప్పుడు తల్లి పాత్రలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కథ చుట్టూ నడిచే స్టోరీలు వచ్చినంత కాలం వాటిల్లో ఆ రోల్ అద్భుతంగా పండేది. సూర్య కాంతం, అంజలి దేవి సీనియర్ నటీమణులంతా అమ్మ పాత్రలను ఆవిష్కరించిన వారే. హీరో రోల్ ఇంపార్టెన్సీ పెరిగిపోతూ వస్తుండటంతో దాని ప్రాధాన్యతను క్రమంగా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఆ హవాను తట్టుకుని నిలబడిన వాళ్లలో ఒకరు నటి సుధ.

తమిళనాడుకు చెందిన సుధ వదిన, తల్లి, అక్క, అత్త ఇలా దాదాపు అన్ని రోల్స్ తో తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యింది. ఒకప్పుడు బిజీగా ఉన్న ఈమె అస్సలు సినిమాల్లో కనిపించటం లేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లన్నీ ఓ ప్రాపర్టీ సెట్ లా మారిపోయాయని చెబుతోంది. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో డైలాగులు కూడా లేకుండా ఏదో ఒక పక్కన నిలబడే క్యారెక్టర్లే వస్తున్నాయి, అందుకే సినిమాలు చేయటం మానేశానని, శ్రీమంతుడులో కూడా ఓ రోల్ ను అందుకే వదిలేశానని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పవిత్రా లోకేశ్; ప్రగతి, హీరోయిన్ టూ మదర్ క్యారెక్టర్లు చేస్తున్న నదియా లాంటి వాళ్ల పరిస్థితే అందుకు ఎగ్జాంపుల్ అని వివరిచింది.

ఇక నాగ్ తో క్లోజ్ నెస్ గురించి చెబుతూ తన ప్రాణాలు పోతాయనుకున్న టైంలో నాగ్ చేసిన హెల్ప్ జీవితాంతం మరిచిపోలేనని, అందుకే ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా చేస్తానని చెబుతోంది. ఉదయ్ కిరణ్ ఎంగేజ్ మెంట్ రద్దయ్యాక తన దగ్గరికి వచ్చి ఏడ్చాడని, ఆ సమయంలో అతన్ని దత్తత తీసుకోవాలని తాను భావించానంది. మీడియా ఫీవర్ గురించి చెబుతూ... ఇంటర్వ్యూలు ఇవ్వడం నాకు అలవాటు లేదు. సినిమా పరిశ్రమలో కొందరు చెప్పిన విషయాల వల్ల మీడియాకు దూరంగా ఉన్నాను. మీడియా వాళ్లు లేని పోని ప్రశ్నలు అడుగుతుంటారని కొందరు భయపెట్టారు అని సుధ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Actress Sudha  Shocking Comments  Mother Roles  

Other Articles