Krishna Vamshi's Nakshatram Movie not shelved.

Krishna vamshi nakshatram gears up for may release

Nakshatram Movie, Nakshatram Movie Release, Krishna Vamshi Nakshatram, Nakshatram Movie Rumour, Sandeep Kishan Nakshatram, Nakshatram Actress, Nakshatram Cast and Crew, Nakshatram Release, Nakshatram Shelved, Nakshatram Movie 2017, Nakshatram Telugu Movie, Krishna Vamshi Rumour

Nakshatram Movie unit have denied that the movie has been shelved is just a rumour. Sandeep Kishan,Sai Dharam Tej, Regina starrer Krishna Vamsi's directorial venture all set to release in May.

నక్షత్రం ఆగిపోలేదు.. మేలో రిలీజ్

Posted: 04/25/2017 05:10 PM IST
Krishna vamshi nakshatram gears up for may release

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ డైరక్టర్ గా వెలుగు వెలిగి ఈ మధ్య సరైన హిట్ పడక సతమతమయిపోతున్నాడు దర్శకుడు కృష్ణ వంశీ. అయితే నక్షత్రం సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమోనన్న ఆశలు టీజర్లతో కలిగించాడు. సందీప్ కిషన్, రెజీనాతోపాటు సాయి ధరమ్ తేజ్, ప్రగ్నా జైస్వాల్, ప్రకాశ్ రాజ్, జేడీ చక్రవర్తి తారాగణం తోనే అంచనాలు పెంచేశాడు. అప్పుడెప్పుడో ఏడాదిన్నర క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

ఆ మధ్య ఫస్ట్ లుక్ లతో హడావుడి చేసినప్పటికీ తర్వాత ఎక్కడా చప్పుడు లేదు. దీంతో సినిమా పని అయిపోయిందన్న ఓ వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. బడ్జెట్ హద్దులు దాటిపోయిందని, అందుకే సినిమాను మధ్యలోనే వదిలేశారని ఇలా రకరకాల రూమర్లు పుట్టించారు. ఐతే వెంటనే రంగంలోకి దిగిన ‘నక్షత్రం’ టీం ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది.

నక్షత్రం చిత్రం విషయం లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. షూటింగ్ చివరి దశలో ఉందని, డబ్బింగ్ కూడా జరుగుతోందని.. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా అవుతున్నాయని.. ఆల్ మోస్ట్ మినహా సినిమా పూర్తయిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. అన్నీ కుదిరితే మే లోనే సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసేసింది కూడా. మరి వంశీ ఈ మాట నిలబెట్టుకుంటాడా? చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Vamshi  Nakshatram Movie  Release Date  

Other Articles