చిరు కోరిక ప్చ్... సగం తీరినట్లే | Chiranjeevi half patriotic dream full filled.

Another biopic in chiranjeevi mind

Chiranjeevi, Chiranjeevi Patriotic Movie, Megastar Bhagat Singh, Bhagat Singh Telugu Movie, Bhagat Singh Biopic, Chiranjeevi MEK, Chiranjeevi Horse Ride, Chiranjeevi 151 Movie

Chiranjeevi wants to do patriotic movie. He wants to play in Bhagat Singh's role. ‘ I wanted to play Bhagat Singh, but things didn’t fall in place. Time and again, the film was made in many languages by many actors. I always regretted not doing such a patriotic and intense character in my career ‘.

చిరు మైండ్ లో మరో డ్రీమ్ రోల్

Posted: 04/12/2017 03:39 PM IST
Another biopic in chiranjeevi mind

మూడు దశాబ్దాల కెరీర్, 150కి పైగా చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో రకాల పాత్రలు చేసుకోచ్చాడు. పచ్చిగా చెప్పాలంటే మోస్ట్ ఎంటర్ టైనింగ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్లు చేసిన హీరోగా చిరును ఇప్పటికీ బీట్ చేసే హీరో టాలీవుడ్ లో లేడనే చెప్పుకోవాలి. అందుకే నంబర్ వన్ చెయిర్ ఇంకా అలాగే ఉండిపోయింది.

అయితే తన డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యలవాడ నరసింహరెడ్డిని త్వరలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న చిరు, తన మదిలో మరో క్యారెక్టర్ కూడా చేయాలన్న కోరిక బలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అదే స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ రోల్ . ‘‘భగత్ సింగ్ పై సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ, టైం కలిసి రావటం లేదు. కొందరు హీరోలు ఇప్పటికే పలు భాషల్లో ఆ వీరుడి పై సినిమాలు తీశారు. నా కెరీర్ మొత్తంలో దేశభక్తి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు నేను చేయలేకపోయాననే తరచూ బాధపడుతుంటాను’’ అని మీలో ఎవరు కోటీశ్వరుడులో తాజా ఎపిసోడ్ లో చిరు చెప్పుకొచ్చాడు.

ఆ బయోపిక్ ఫ్యూచర్ లో కూడా కష్టమే అయినప్పటికీ అలాంటి భావజాలాలే ఉన్న ఉయ్యలవాడ తోనైనా చిరు ఆశయం సగం తీరబోతుందనే అనుకోవాలి. అన్నట్లు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యలవాడ నరసింహా రెడ్డి షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ చిత్రంలో మరో సీనియర్ హీరో కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Bhagat Singh Biopic  MEK  

Other Articles