అలియా షాకింగ్ డెసిషన్.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు | Alia Bhatt wants to get married soon.

Alia bhatt on marriage plans

Alia Bhatt, Alia Bhatt Marriage Plan, Alia Bhatt Sidharth Malhotra, Alia Bhatt, Alia Bhatt Wedding, Sidharth Malhotra Wedding, Alia Bhatt Siddarth Malhotra Marriage

Marriage on Alia Bhatt's mind, lady wants to settle down early in life. What does Sidharth malhotra have to say?

తొందరలోనే పెళ్లి చేసుకుంటా: అలియా భట్

Posted: 03/30/2017 09:45 AM IST
Alia bhatt on marriage plans

చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ డమ్ ను సంపాదించేసుకుంది మహేష్ భట్ కూతురు అలియా భట్. మొదట్లో నటన గురించి తీవ్ర విమర్శలు రావటంతో ఆపై లోపాలను సరిచేసుకుని మెచ్యూర్డ్ రోల్స్ తో వరుసగా ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా బద్రీనాథ్ కీ దుల్హానియాతో మరో వంద కోట్ల చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న అలియా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందంట. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని స్వయంగా అలియానే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

‘నేను లైఫ్ లో తొందరగా సెటిల్ అవుదామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను కెరీర్ ను చాలా చిన్న వయసులోనే ప్రారంభించాను కాబట్టి. ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగిపోతే బాగుంటుందని నా ఒపీనియన్. అందుకే తొందరలోనే నా పెళ్లి ఉండొచ్చు’ అంటూ హింట్ ఇచ్చేసింది. అయితే ఈ క్రమంలో కొందరు సీనియర్లపై ఆమె సెటైర్లు కూడా వేసింది.

కొంతమంది లాగా తాను 30 ఏళ్ల వరకు ఆగాలని తాను భావించడం లేదని చెప్పింది. ఆలస్యంగా వివాహం చేసుకున్నవారంతా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతూ, తాను మాత్రం అలా భావించడం లేదని చెప్పింది. చిన్న ఏజ్ లో ఇండస్ట్రీలో చాలా ప్రయోజనాలు పొందానని, అందుకే ఎర్లీగా వివాహం చేసుకుని అందులోని అడ్వాంటేజ్ లు కూడా పొందుతానంటూ కామెంట్ చేసింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేస్తావా? అని అడిగితే చేస్తానని చెబుతోంది. ఆ విషయంపై సిద్ధార్థ్ మల్హోత్రాను అడిగితే మరింత క్లారిటీ వచ్చి ఉండేదేమో కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Sidharth Malhotra  Early Marriage  

Other Articles