శింబు ఒక్క మాట అన్నాడు అంతే... సుచి లీక్స్ పై సైలెన్స్ | Hansika not quarrel with Simbu.

Hansika reveals how she break up with simbu

Actress Hansika, Simbu, Simbu Hansika, Hansika Break Up, Simbu Hansika Break Up, Hansika About Simbu, Hansika About Jayam Ravi, Hansika Latest Interview, Hansika Simbu Fight

Actress Hansika reveals how she break up with Simbu.

శింబుతో గొడవ పడకుండానే విడిపోయా-హన్సిక

Posted: 03/25/2017 05:23 PM IST
Hansika reveals how she break up with simbu

టాలీవుడ్ తో ఆరంగ్రేటం చేసి ఆపై కోలీవుడ్ లో ఆరాధ్య హీరోయిన్ గా మారిపోయింది హన్సిక. పద్నాలుగేళ్లకే హీరోయిన్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లోనే ఎక్కువ కాన్ సంట్రేషన్ చేస్తూ వస్తోంది. అయితే కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలోనే శింబుతో ప్రేమాయణం నడిపి వార్తల్లోకి ఎక్కింది. ఆ ప్రేమ కాస్త మూనాళ్ల ముచ్చటగా మారిపోయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ అఫైర్ పై స్పందించి పలు ఆసక్తికర విషయాలనే వెల్లడించింది కూడా.

ఆ సమయానికి నేను మెచ్యూరిటీతో లేను. కేవలం ఆకర్షణ మాత్రమే. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఆమె తెలిపింది. తాము అసలు గొడవ పడలేదని అసలేం జరిగిందో వివరించింది. ‘‘శింబు నన్ను ఒక మాట అన్నాడు. దాంతో, తన మనసు విరిగిపోయింది. ప్రతిగా నేను కూడా ఓ మాట అనేశా.. అప్పటి నుంచి శింబుకి దూరంగా ఉన్నాను’’ అంటూ తెలిపింది.

ఇక తామిద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలసి సినిమా చేశామని... ఇప్పటికీ తనకు శింబుతో ఎలాంటి ఇబ్బంది లేదని హన్సిక అంటోంది. ఇద్దరి మనసులు కలిశాయని అనుకున్నా.. కానీ, అదంతా భ్రమే అన్న విషయం తెలియగానే పక్కకు వెళ్లిపోయానంటూ చెప్పింది. ఇక పర్సనల్ పోటో లీక్ వ్యవహారం ప్రస్తావిస్తూ... లీక్‌ ఎవరు చేశారన్నది తేలిన తరువాతే మాట్లాడతానంటూ దాటవేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Hansika  Simbu Affair  Break Up  

Other Articles