త్రిషపై పుకార్లు.. తల్లి ఏమందంటే... | Trisha's mother clarity on her health.

Actress trisha not hospitalized

Trisha Hospitalised, Actress Trisha Health, Trisha Rumour, Actress Trisha Health Rumour, Trisha Mother Uma Krishnan, Uma Krishnan on Trisha Health, Kollywood Actress Trisha, Trisha Safe, Sathuranga Vettai 2 Trisha

Actress Trisha Hospitalised. Her Mother Uma Krishnan clarified that just rumour and now she was in Malaysia and busy Aravind Swamy's Sathuranga Vettai 2 shooting.

ఆస్పత్రిలో త్రిష.. అంతా ఉత్తదే!

Posted: 03/23/2017 09:55 AM IST
Actress trisha not hospitalized

కోలీవుడ్ లో సుచి లీక్స్ రేపిన దుమారం తీవ్రత ఇంకా తగ్గలేదు. ఇంతలోనే అందుకు కారకురాలైన సింగర్ సుచిత్ర కార్తీక్ కిడ్నాప్ కు గురైందని, దాని వెనుక సినీ పెద్దల హస్తం ఉందని కోలీవుడ్ లో గాసిప్స్ గుప్పుమన్నాయి. అదలా ఉంచింతే ధనుష్ తో తన వీడియోలు, ఫోటోలు, రానాతో కిస్ ఫోటో బయటికొచ్చాక హీరోయిన్ త్రిష వేదాంత ధోరణిలో సుచిత్రపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఆపై సైలెంట్ అయిపోయిన త్రిష బయట కూడా సందడి చేయటం మానేసింది.

అయితే ఈ డస్కీ బ్యూటీ తీవ్ర అనారోగ్యానికి గురైందన్న వార్త బయలుదేరింది. చెన్నైలో కాకుండా హైదరాబాద్ లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సీక్రెట్ గా ట్రీట్ మెంట్ ఇస్తున్నారని దాని సారాంశం. దీంతో త్రిష హర్డ్ కోర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గరయ్యారు. ఆ వెంటనే తెలుగు మీడియాకు చెన్నై నుంచి ఫోన్ కాల్స్ రావటం ప్రారంభమైంది.

ఇది చాలదన్నట్లు త్రిష సంప్రదించేందుకు మీడియా ట్రై చేయగా, ఆమె అందుబాటులో లేకపోవటంతో దాదాపు అదే వార్త కన్ఫర్మ్ చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఆమె తల్లి ఉమా కృష్ణన్‌ అవన్నీ పుకార్లని, త్రిష క్షేమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అరవింద స్వామి కి జోడిగా నటిస్తున్న సతురంగవెట్టై-2 షూటింగ్ కోసం మలేషియాలో ఉందని ఆమె క్లారిటీ ఇచ్చింది. మరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష దీనిపై స్పందించి ఉంటే బావుండేది కదా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Trisha  Uma Krishnan  Health Rumour  

Other Articles