విడాకుల కోసం వెళ్లిన రంభకు కోర్టు ఏం చెప్పిందంటే... |

Family court advice to actress rambha

Actress Rambha, Chennai Family Court, Rambha Divorce, Actress Divorce, Court Advice Actress, Actress Rambha Kids, Rambha Husband, Rambha Divorce Reason, Twist in rambha Divorce

Chennai Family Court's important advice to actress Ramba in her divorce case.

నటి రంభకు కోర్టు విలువైన సలహా

Posted: 03/21/2017 10:36 AM IST
Family court advice to actress rambha

టాలీవుడ్ తోపాటు దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించిన అందాల తార రంభ వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల గురించి తెలిసిందే. ఇంద్రకుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె తర్వాత కెనెడాలో కాపురం పెట్టింది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటం, పిల్లలను తీసుకుని రంభ ఇండియాకు వచ్చేయటం జరిగాయి. దీంతో ఏదో జరిగిందంటూ మీడియా కథనాలు ప్రసారం అయ్యాయి.

అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తాము బాగానే ఉన్నామంటూ రంభ రిక్వెస్ట్ చేసింది. అది జరిగిన నెల లోపే విడాకుల కోసం ఈ నటి కోర్టుకెక్కటం షాక్ కి గురిచేసింది. ఏదైతేనేం డైవోర్స్ తోపాటు పిల్లల పోషణార్థం నెలకు 2.5 లక్షల భరణం ఇప్పించాలని న్యాయస్థానానికి విజ్నప్తి చేసిన రంభ, తాజాగా పిల్లల పెంపకం కూడా తానే చూస్తానంటూ మరో పిటిషన్ దాఖలు చేసింది కూడా.

ఈ నేపథ్యంలోనే సోమవారం పిల్లలతోసహా వారిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హజరుకాగా, కుటుంబ సమస్య కాబట్టి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలంటూ న్యాయమూర్తి వారిద్దరకీ సూచించినట్లు తెలుస్తోంది. విడాకులు, విడిపోవటమే అన్నింటికి పరిష్కారం కాదని చెబుతూ ఓ న్యాయవాదితో ప్రత్యేక గదిలో మంతనాలు చేయించినట్లు సమాచారం. అయితే విడాకుల కోసమే పట్టుబడుతున్న ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందా? ఏదన్నది మాత్రం తదుపరి విచారణలో అసలు బయటపడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Rambha  Divorce  Chennai Family Court  

Other Articles