సన్యాసి టూ సంసారి.. హాట్ హాట్ గా కాబోయే భర్తతో ఫోజులు | Sin Sofia Hayat Hot Poses with Hubby.

Sofia hayat reveals fiance photo in instagram

Sofia Hayat, Vlad Stenescu, Sofia Hayat Hubby, Sofia Hayat Hot Poses, Sofia Hayat Wedding, Sofia Hayat Instagram, Sofia Hayat Fiance Photos, Sofia Hayat Husband

Sofia Hayat reveals fiance Vlad Stenescu photos. Actress Decided to Get married Within a Week of Dating.

కాబోయే భర్తతో హాట్ గా సోఫియా హయత్

Posted: 03/18/2017 12:53 PM IST
Sofia hayat reveals fiance photo in instagram

సింగర్ కమ్ నటి సోఫియా హయత్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో అందాలతో దుమ్ము రేపిన సోఫియా సడన్ గా సన్యాసిగా మారిపోయి పెద్ద షాకే ఇచ్చింది. అయితే నన్ గా మారిపోయినప్పటికీ అభిమానుల కన్ను తనపై వేసుకునేందుకు తెలివిగా యోగాలో కూడా హాట్ యాంగిళ్లను చూపిస్తూ పైగా రాందేవ్ బాబా ను మధ్యలోకి లాగి ఆయనకంటే ఎక్కువ బట్టలే కట్టుకుంటున్నానంటూ పంచ్ లు కూడా వేసింది.

పర్సనల్ వ్యవహారాలను చాలా గోప్యంగా ఉంచే సోఫియా పెళ్లి వద్దనుకునే సన్యాసం తీసుకున్నట్లు అప్పుడు చెప్పుకొచ్చింది కూడా. ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలీదుగానీ తన భాయ్ ప్రెండ్, ఇంటీరియర్ డిజైనర్ కమ్ ఫెర్ ఫ్యూమ్ మోడల్ అయిన వ్లాద్ స్టెనెస్కు ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అసలు సన్యాసిగా ఉన్న ఆమె ఎప్పుడు ప్రేమలో పడింది, ఎంత కాలం నుంచి రిలేషన్ లో ఉందనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.

దీనిపై సోఫియా వేదాంత ధోరణిలోనే క్లారిటీ ఇస్తోంది. తన ప్రేమ కల్పితం కాదు. ఇతనే నా కాబోయే వరుడు. ప్రేమ పుట్టడానికి కొన్ని క్షణాలు చాలంటూ చెబుతూనే తాము కేవలం వారంపాటు డేటింగ్ చేసి ఒకరినోకరు అర్థం చేసుకున్నామని, ఆపై ఎంగేజ్ మెంట్ వెంటనే చేసుకున్నామని చెప్పుకొచ్చింది. ఏది ఏమైతేనేం ఈ బ్రిటీష్ భామ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 24న ఈ జంట ఒకటి కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sofia Hayat  Vlad Stenescu  Wedding  

Other Articles