దువ్వాడ దూకుడు.. కాస్త గ్యాప్ ఇవ్వవయ్యా బాబు... | Duvvada Jagannatham teaser on Maha Sivarathri.

Allu arjun dj teaser date released

Duvvada Jagannadham Movie Teaser, Bunny DJ Teaser, Allu Arjun DJ Official Teaser, Maha Shiva Rathri DJ, DJ First Teaser, Allu Arjun Duvvada jagannadham Teaser, Duvvada Jagannadham

Allu Arjun Duvvada Jagannadham Movie teaser date & time. the film unit is planning to release an interesting teaser on the occasion of Maha Shiva Rathri. The teaser will be out on 24th of this month at 9 PM. The film is scheduled for a grand release during Summer.

డీజే టీజర్ డేట్ అప్పుడేనంట!

Posted: 02/22/2017 01:44 PM IST
Allu arjun dj teaser date released

వరుసగా పవర్ ఫుల్ హిట్లు కొడుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ ‘దువ్వాడ జగన్నాథం’ పై అంచనాలు ఇంచుకూడా తగ్గటం లేదు. ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావటంతో పైగా హైప్ మరింత పెరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ లుక్కు నుంచి బయటపడేందుకు కొంచెం టైం దొరుకుతుందని భావించేలోపే టీజర్ రాబోతుంది.

మహాశివరాత్రి కానుకగా ఈ నెల 24న దువ్వాడ జగన్నాథం టీజర్ రిలీజ్ కాబోతుంది. ఉదయం 9 గంటలకుడీజే టీజర్ లాంచ్ చేయనున్నట్లు దర్శకుడు చిత్ర బృందం ప్రకటించింది. నిజానికి టీజర్ ను ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ సరైన టైం కోసం వెయిట్ చేసిన టీం శివరాత్రికే రిలీజ్ చేయడానికి ఓ కారణం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో బన్నీ బ్రాహ్మిణ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ లుక్ పోస్టర్ లో శివలింగం, రుద్రాక్షను హైలెట్ చేసి చూపించారు. దీంతో బన్నీ శైవ భక్తుడిగా కనిపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకే ఆ రోజున రిలీజ్ చేయబోతున్నారంట.

ఫస్ట్ లుక్ తరహాలోనే టీజర్ కూడా అదిరిపోయే రేంజిలో ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్ వచ్చిన వారం లోపే టీజర్ కూడా వచ్చేస్తుండటంతో బన్నీ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. మరోవైపు అన్ని టైంకి పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Duvvada jagannadham Teaser  Maha Shiva Rathri  

Other Articles