‘కొత్త’ ప్రయోగం వికటిస్తే మాత్రం దారుణం | Koratala Fresh Faces for Mahesh Babu Movie.

Koratala new technical team for mahesh babu movie

Director Koratala Siva, Koratala Siva, Mahesh Babu 24th Movie, Mahesh Babu Koratala Siva, Koratala Siva 2017, Mahesh Babu Upcoming Movie, Mahesh Babu 2017, Mahesh Koratala New Movie, koratala New Technical Team

Director Koratala Siva mostly worked with same technical team for all three movies he directed. But now for Mahesh Babu 24th Movie he wants to take different crew in key departments to give fresh look for his movie. He has taken story from another writer, he has roped in Ravi K Chandran as cameraman. He wants to put fresh and best talent in direction departments and other areas.

మహేష్ సినిమా అంతా కొత్తవాళ్లేనా?

Posted: 02/15/2017 03:37 PM IST
Koratala new technical team for mahesh babu movie

ఓవైపు మురగదాస్ సినిమా సెట్స్ మీద ఉండగా కొరటాల శివతో కూడా ప్రాజెక్టును మొదలుపెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదే ఏడాదిలో తన రెండో సినిమాను రీలీజ్ చేయాలని మహేష్ ఫ్లాన్ చేసుకున్నాడు. అయితే కారణాలేంటో తెలీదుగానీ 23వ చిత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో రెండో ప్రాజెక్టు ను మొదలు పెట్టే విషయం గురించి కొద్దిరోజులు ఆలోచించకుండానే ఉంటే మంచిదని భావిస్తున్నాడంట.

అదే సమయంలో మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులతోపాటు టోటల్ టీం ను కూడా ఛేంజ్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు కొరటాల. ఒకే తరహా టేకింగ్ తో ఊదరగొడుతున్నాడని, పైగా అందులో ఫ్రెష్ నెస్ కూడా ఏం ఉండట్లేదనే కంప్లైయింట్ ఉంది. అందుకే తన టీంలో మార్పులు చేసేందుకే కొరటాల మొగ్గు చూపుతున్నాడని సమాచారం. జనతా గ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ, అందులో వచ్చే సన్నివేశాల విషయంలోనే కొన్ని విమర్శలు వినిపించాయి. దీంతో మహేష్ సినిమా విషయంలో ఆ తప్పు దొర్లకూడదనే భావనకి వచ్చిన కొరటాల అల్రెడీ ఆ పని ప్రారంభించాడు కూడా.

ఇప్పటికే కథను వేరే రచయితతో రెడీ చేయించుకున్న ఈ స్టార్ రైటర్ కమ్ దర్శకుడు మహేష్ తో ఇప్పటిదాకా జత కట్టని హీరోయిన్ కోసం వేటలో ఉన్నాడని చదివాం. ఇప్పుడు కెమెరా మెన్ విషయంలో కూడా ఓ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. టాప్ సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ ను మహేష్ తో తీయబోయే సినిమా కోసం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగతా వారి విషయంలో ఇదే ఫాలో కాబోతున్నాడు కూడా.

కొరటాల ఇంత జాగ్రత్త తీసుకోవటానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. తొలి సినిమా మిర్చితోనే 40 కోట్లు కొల్లగొట్టి, ఆపై శ్రీమంతుడుతో టాలీవుడ్ లో నాన్ బాహుబలి కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిపాడు. ఆపై గ్యారేజ్ కూడా 3 ప్లేస్ లో నిలిచింది. ఇక ఖైదీ నంబర్ 150 కలెక్షన్ల హంగామా తెలిసిందే. అందుకే మరో 100 కోట్ల సినిమాగా మలిచేందుకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్నది స్పష్టమౌతోంది.

 

కొరటాలకు సొంత కథపై నమ్మకం లేదా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Koratala Siva  New Movie  

Other Articles