సమంతకి డూప్లికేట్ వచ్చేసింది.. పైగా తెలుగమ్మాయే | Ashu Reddy as Duplicate Samantha.

Samantha duplicate viral in instagram

Ashu Reddy, Ashu Reddy Instagram, Ashu Reddy Samantha, Samantha Dupe, Ashu Reddy Dupe, Duplicate Samantha, Samantha Xerox, Samantha Ashu Reddy, Ashu Reddy Dub Smashes

A Telugu girl named Ashu Reddy has become a small-scale celeb on social media thanks to her close resemblance with Samantha. This beautiful Reddy girl has already amassed close to 40K followers on instagram.

సమంత డూపిక్లేట్ దొరికేసిందోచ్

Posted: 02/08/2017 08:55 AM IST
Samantha duplicate viral in instagram

ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్నది ఒక వాడుక ఉంది. అయితే.. కవలలు తప్ప, మిగతా వారిలో దగ్గరి పోలికలు ఉండటం చాలా కష్టమనేనంటూ జెనెటిక్ రీసెర్చ్ లో తేలింది. అదే సమయంలో తమను పోలిన ఇతర వ్యక్తులను కలుసుకోవడం అనేది నూటికో కోటికో ఒక్కరికే జరిగే అరుదైన సంఘటన.

మాములు జనాల కంటే, క్రేజ్ ఉండే సెలబ్రిటీల విషయంలో మాత్రం తొందరగా హైలెట్ అవుతుంటారు. అలాంటిది ఓ తెలుగమ్మాయి అచ్చం సౌత్ బ్యూటీ సమంతను పోలి ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె పేరు అషు రెడ్డి. ఇన్ స్టాగ్రామ్ లో 40 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాస్త సమంత పోలికలు ఉన్న అమ్మాయి, అలాగే ఫోజులు ఇస్తూ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో ఈమె తెగ హల్ చల్ చేసేస్తోంది.

అంతే కాదు సమంత పలికిన ఫేమస్ డైలాగ్స్ కు డబ్ స్మాష్ చెప్పి.. సోషల్ మీడియా ద్వారా ఫాలోయర్స్ తో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంటోంది అషు రెడ్డి. ఎలాగూ సమంతకు పెళ్లి కాబోతుంది కదా, మరి ఇక అభిమానుల కన్ను ఈ జిరాక్స్ మీద పడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.  ఇన్ స్టాగ్రామ్ లోనే తెగ యాక్టివ్ గా ఉండే సమంత తన డూప్ ను ఇంతదాకా చూసుకోలేదేంటి చెప్మా!

Samantha Dupe Ashu Reddy Instagram

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sanabtha  Ashu Reddy  Duplicate  

Other Articles