ఎన్టీఆర్ కి కొత్త భయం.. ఫ్యూఛర్ లో ఆ పని అస్సలు చేయడంట ! | Voice over Sentiment For Junior NTR.

Ntr skip voice over for rana ghazi

Junior NTR, NTR Voice Over, NTR Ghazi, NTR New Sentiment, NTR Lendin Voice, Junior NTR Voice, NTR Voice over Sentiment, NTR Flop Sentiment

Junior NTR reveals why he not lending his voice to Ghazi. Jr NTR rejected to lend his voice smoothly and said that the films he gave the voice for have failed at the box office and he does not want that sentiment to carry forward to Ghazi. The film unit later approached Mega Star Chiranjeevi for the same, and he instantly accepted to give his voice for the film.

ఎన్టీఆర్ ఇక ఆ పని అస్సలు చేయడంట!

Posted: 01/30/2017 04:36 PM IST
Ntr skip voice over for rana ghazi

ఇప్పుడున్న యంగ్ స్టర్ హీరోలు ప్రయోగాలకు వెనకాడకుండా ముందుకు వెళ్తుండటం నిజంగా మంచి పరిణామమే. హీరోల డామినేషన్ పోయి, కథలకు అనుగుణంగా వాళ్లే మారిపోవటం చూస్తున్నాం. అగ్రహీరోలు కూడా అందుకు మినహాయింపు కాకపోవటమే ఇక్కడ చర్చనీయాంశం. అలాగే ఒకరి సినిమాకు మరోకరు చేతనైన సాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కూడా. అయితే ఇలాంటి సమయంలో కూడా ఓ స్టార్ హీరో సెంటిమెంట్ ను ఫాలో అవ్వటం చర్చకు దారితీస్తోంది.

దగ్గుబాటి రానా త్వరలో ఘాజీ అనే ఓ చిత్రంతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ ఇప్పించబోతున్నారని చెప్పుకున్నాం. హిందీ వర్షన్ కి అమితాబ్ బచ్చన్ అల్రెడీ తన పోర్షన్ ను పూర్తి చేసుకోగా, తమిళ్ కు సూర్య ను సెలక్ట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ. అయితే తెలుగులోనే ముందు ఎన్టీఆర్ ను అనుకున్నప్పటికీ ఆ తర్వాత మెగాస్టార్ గాత్రంను ఫైనలైజ్ చేసేశారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సైడ్ నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది.

గతంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పిన సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదు. రామ్ హీరోగా వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకు జూనియర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంతేకాదు కన్నడలో తాను పాడిన పాట హిట్ అయ్యింది కానీ, సినిమా (పునీత్ రాజ్ కుమార్ సినిమా చక్రవ్యూహా) మాత్రం ఆడలేకపోయింది. దీంతో ఫ్లాప్ సెంటిమెంట్ మూలంగానే ఇక పై తాను ఇతరులకు వాయిస్ ఇవ్వకూడదని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడంట. అంతేకాదు నాని నేను లోకల్ లో కూడా ఎన్టీఆర్ తో ఓ పాట పాడించాలని దేవీశ్రీప్రసాద్ ప్లాన్ కూడా వేసుకున్నాడు. కానీ, ఈ రీజన్ తోనే అది కూడా ఆచరణకు నోచుకోలేకపోయిందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Ghazi  Voice Over  Flop Sentiment  

Other Articles