జల్లికట్టుపై కేంద్రం ఆర్డినెన్స్ తెస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అది అమలయ్యే దాకా తగ్గేది లేదంటూ యావత్ తమిళ యువత మెరీనా బీచ్ లో తిష్ట వేసి కూర్చుంది. రాజకీయ, సినీ వర్గాలు కూడా వారికి మద్ధతు పలకటం, పైగా వివాదం అంతర్జాతీయ మీడియాలో కూడా హైలెట్ కావటం, పరిస్థితి ముదిరిపోతుందని గమనించిన ప్రభుత్వం జల్లికట్టుపై సానుకూలంగా స్పందించింది.
అయితే కోలీవుడ్ ఈ పోరాటంలో చూపిన చొరవకు ప్రత్యేక అభినందనలు కురుస్తున్నాయి. నడిగర్ సంఘం తరపున రజనీ, కమల్, అజిత్,సూర్య లాంటి స్టార్లు నిరాహర దీక్షకు కూర్చోవటం, ధనుష్ అయితే ఏకంగా తన పెటా అవార్డు(వెజిటేరియన్) తీసుకున్నందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటం, అంతెందుకు ముందు జల్లికట్టును వ్యతిరేకించిన త్రిష దెబ్బకి దిగొచ్చి మద్ధతు ఇవ్వటం, వీరిందరిని మించి ఏకంగా కోటి రూపాయల సాయం ప్రకటించి లారెన్స్ సూపర్ హీరో గా ప్రశంసలు అందుకోవటం తదితర పరిణామాలు చూశాం. అయితే ఈ ఊపులో మరో స్టార్ హీరో ఎవరికీ కనిపించకపోవటంపై కాస్త విమర్శలు వినిపించాయి.
సూపర్ స్టార్ తలైవా తర్వాత అంతటి మాస్ పాలోయింగ్ ఉన్న విజయ్ జల్లికట్టుకు మద్ధతు ప్రకటించినప్పటికీ, ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ, మిగతా హీరోల మాదిరి కాకుండా తానేంటో మరోసారి చూపించాడు. ఏకంగా మెరీనా బీచ్ లోని ఆందోళనకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. అభిమానులు ఎగబడిపోతారన్న ఉద్దేశంతో ఎవరూ గుర్తుపడకుండా ఉండేందుకు ముఖానికి ముసుగు కట్టుకుని మరీ ప్రత్యక్షమయ్యాడు. కాసేపు అలాగే ఉండి ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూల్ గా విజయ్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more