మహేష్ మాత్రమే దారుణంగా హ్యాండిచ్చాడు | No first look of Mahesh and Murugadoss.

No first look of mahesh and murugadoss on new year

Mahesh Babu, Mahesh 23rd movie first look, No first look of Mahesh babu, Mahesh Babu-Murugadoss, Mahesh about Murugadoss, Mahesh Babu next movies, Mahesh upcoming three movies, mahesh babu 2018 movies, Mahesh Babu twitter, Mahesh ram charan families, Mahesh Babu Ram Charan wives, Mahesh Babu Ram Charan hlidays

Mahesh Babu disappoint with no first look but insist of that he announced three upcoming projects.

మహేష్ మాత్రమే నిరాశపరిచాడంట!

Posted: 01/02/2017 10:04 AM IST
No first look of mahesh and murugadoss on new year

కొత్త సంవత్సరం టైటిల్ విషయంలో ఓ స్పష్టత వస్తుందనుకుంటే, అలాంటిదేం లేకుండా పోయింది. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. అయితే ఆ లోటు తెలీకుండా తన మిగతా ప్రాజెక్టుల గురించి ట్వీటేసి కాస్త ఊరడించాడు మహేష్. 2017 లో తాను నాన్ స్టాప్ గా బిజీగా ఉండబోతున్నానని అనౌన్స్ చేశాడు.

ప్రస్తుతం మురగదాస్ తో ప్రాజెక్టు చేస్తున్న తాను ఎంతో గొప్పగా ఫీలవుతున్నానని, మురగదాస్ లాంటి సూపర్ కూల్ దర్శకుడితో చేయాలన్న తన కల నెరిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక కొరటాలతో తర్వాతి సినిమా, వంశీపైడిపల్లితో తన 25వ సినిమా ఉంటుందని అఫీషియల్ గా చెప్పిన మహేష్ తన 26వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో మైత్రిమేకర్స్ బ్యానర్ లో ఉండబోతుందని చెప్పేశాడు. తన కెరీర్ లోనే ఈ వరుస సినిమాలు తనకు ఎంతో సంతోషాన్నిస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు.

మొత్తానికి ఈ యేడాది మొత్తం తాను వరుస సినిమాలతో బిజీగా ఉంటానని చెప్పేసిన మహేష్ 2018 సినిమాలను కూడా ముందే అనౌన్స్ చేసేశాడు. ఇక ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ టెక్నికల్ సమస్య అని చెబుతున్నప్పటికీ, ఎప్పడన్నదానిపై మళ్లీ ఎప్పుడన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం.

ఇక ప్రస్తుతం మరో నట వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫ్యామిలీతో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్, ఆ ఇద్దరి జంటలు కలిసి దిగిన ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Mahesh Babu and Ram Charan with wives

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  upcoming movies  official announcement  

Other Articles