తన నోటి దూలతో నిన్నటి నుంచి కోలీవుడ్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న దర్శకుడు సూరజ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. హీరోయిన్ల బట్టలు ఎంత తక్కువ వేసుకోవాలన్న దానిపైనే కాంసంట్రేషన్ చేస్తున్నారని, నటన పట్టించుకోవట్లేదంటూ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేవలం హీరోయిన్స్ ను ఎక్స్ పోజింగ్ కోసమే మాత్రమే సినిమాల్లోకి తీసుకుంటున్నామని, వాళ్లు ఎంత చూపిస్తే మాస్ జనాలకు అంత కిక్' అంటూ సూరజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో చిర్రెత్తకొచ్చిన నయనతార సూరజ్ ను ఎడా పెడా వాయించేసింది. 'మేమేమీ స్ట్రిప్పర్స్ కాదు' అంటూ తిట్టిపోసింది. ఇక మరో హీరోయిన్ తమన్నాకి ఈ విషయం తెలిసి 'ఆ దర్శకుడు సారీ చెప్పాల్సిందే.. లేకపోతే పరిస్థితి చాలా దూరం వెళుతుంది' అన్నట్లుగా బెదిరించేసింది.
ఇండస్ట్రీ నుంచి కూడా ఈ దర్శకుడి కామెంట్స్ కి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగొచ్చిన ఈ దర్శకుడు.. క్షమాపణలు చెప్పాడు. సూరజ్ తన ట్విట్టర్ ఖాతాలో సారీ చెప్పేశాడు. అంతేకాదు నడిగర్ సంఘానికి ఓ క్షమాపణ పత్రం కూడా రాశాడు. ' తమన్నాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోయిన్స్ అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. వారి సెంటిమెంట్స్ ను దెబ్బ తీయాలని అనుకోలేదు. మరోసారి సారి చెబుతూ నా కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నా' అన్నాడు సూరజ్.
My Apology Statement to all the Heroines In the Industry !! pic.twitter.com/dt6sIkJHly
— Suraj (@DirectorSuraaj) December 26, 2016
కాగా, సూరజ్ విశాల్ హీరోగా తీసిన ఒక్కడొచ్చాడు దర్శకుడు. సినిమా అక్కడా, ఇక్కడా రెండు చోట్ల అట్టర్ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. చెత్త సినిమాలతో విసిగిస్తాడంటూ సూరజ్ ను కోలీవుడ్ జనాలు తిట్టిపోస్తుంటారు కూడా.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more