అమీర్ అడిగితే షారూఖ్, సల్మాన్ ఏం రిప్లై ఇచ్చారు.. దంగల్ రజనీ ఎలా మిస్పయ్యాడంటే... | Aamir Khan ready to do it for SRK and Salman.

Aamir khan special screening of dangal for srk salman

Aamir Khan Dangal Special Screening, Sharukh Khan and Salman Khan Dangal Special Screening, Aamir Khan Dangal, Khan Trio, Dangal rajinikanth, Rajanikanth voice to Aamir Khan

Aamir Khan Invited Salman And Shah Rukh For Dangal Special Screening. Aamir Khan said he messaged both SRK, Salman for a screening. But they are busy with their projects.

నేను రెడీనే.. షారూఖ్, సల్మాన్ లే బిజీ!

Posted: 12/22/2016 04:14 PM IST
Aamir khan special screening of dangal for srk salman

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దంగల్ కి అల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది. అదేంటీ సినిమా శుక్రవారం కదా రిలీజ్ అనుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే పడుతున్న  స్పెషల్ షోలు చూసేసిన పలువురు సెలబ్రిటీలు చెప్పిన అభిప్రాయం అదేనండీ. ఓవరాల్ గా సినిమాలో అమీర్ చించి పడేశాడని మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ గా జీవించేశాడని, కూతుళ్లుగా చేసిన వాళ్లు పోటీ పడి మరీ నటించారని ఇలా ఎవరి వర్షన్ లో వాళ్లు హిట్ అంటూ ప్రకటించేశారు.

ఇంతదాకా బాగానే ఉన్న అమీర్ ఈ సినిమా ప్రమోషన్ దగ్గరి నుంచి స్పెషల్ షోల దాకా చేసిన వ్యవహారంపైనే అసలు చర్చ నడుస్తోంది. అసహనం వ్యాఖ్యల తర్వాత అమీర్ సినిమాలను ఆడనివ్వరన్న భయమో ఏమో కొంతకాలం అజ్నాతంలోకి వెళ్ల సైలెంట్ గా షూటింగ్ చేసుకున్న అమీర్ ఆ తర్వాత ఒక్కసారిగా హడావుడి చేయటం ప్రారంభించారు. నోట్ల రద్దు దేశానికి ఉపయోగపడే అంశమని, అందుకోసం తన సినిమాపై ఎఫెక్ట్ పడ్డా ఫర్వాలేదంటూ ఓ ప్రకటన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇక ఎన్నడూ లేని విధంగా కాఫీ విత్ కరణ్ షోకి హాజరై పెద్ద షాకే ఇచ్చాడు. ఆపై సచిన్, రాజ్ థాక్రే, మహవీర్ సింగ్ ఫ్యామిలీ చివరకు అప్పట్లో తాను వ్యతిరేక కామెంట్లు చేసిన సన్నీలియోన్ ను కూడా స్పెషల్ కి షోకి ఆహ్వానించి వాళ్లతో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఇదంతా చాలదన్నట్లు తోటి పోటీదారులు షారూఖ్, సల్మాన్ ల కోసం స్పెషల్ వేసేందుకు సిద్ధమయ్యాడు కూడా. ‘‘వాళ్లకు అల్రెడీ సందేశం పంపాను. కానీ, ప్రస్తుతం వాళ్ల వాళ్ల సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్లు ఎప్పడంటే అప్పుడు స్పెషల్ షో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ మీడియాకు తెలిపాడు అమీర్. ఖాన్ త్రయంలో ఆ ఇద్దరూ అమీర్ తో అంతగా సైక్యంగా ఉండరనేది ఓపెన్ సీక్రెట్. దీనికి భిన్నంగా వాళ్ల కోసం షో వేసి తీరతానంటూ అమీర్ ప్రకటించడం కొసమెరుపు.

ఇక రజనీకాంత్ సూచన మేరకే తాను తమిళ్, తెలుగు భాషల్లో దంగల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించాడు. నిజానికి తమిళ్ వర్షన్ కి రజనీతో డబ్బింగ్ చెప్పాలని అనుకున్నారంట. అయితే తనకు రజనీ వాయిస్ మ్యాచ్ కాకపోవటంతోనే ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు అమీర్ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Dangal special screening  SRK and Salman Khan  

Other Articles