హాలీవుడ్ తరహాలో బాహుబలి... దేనికోసం? | Baahubali becames Game of thrones.

Baahubali serial coming soon

Baahubali serial, Vijayendra Prasdad Baahubali Serial, Baahubali Serial Hollywood style, Game of thrones Baahubali

Baahubali serial confirmed by Vijayendra Prasad.

బాహుబలి మెగా డెయిలీ సీరియల్ కానే కాదు

Posted: 12/10/2016 05:17 PM IST
Baahubali serial coming soon

బాహుబలి మేనియా ఇంకా అయిపోలేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో రెండో పార్ట్ ప్రభంజనం ఉండబోతుంది. బాహుబలి ది కంక్లూజన్ కోసం దేశం మొత్తం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ రీసెంట్ గా ఓ పోల్ లో తెలిసింది. ఇదిలా ఉండగా బాహుబలి గురించి ఇప్పుడు మరో వార్త సందడి చేస్తోంది. త్వరలో సీరియల్ రూపంలో బాహుబలి బుల్లితెరపై సందడి చేయబోతుంది.
బాహుబలిని టెలివిజన్ సిరీస్ రూపంలోకి తీసుకొస్తున్నారని చెప్పాడు రచయిత విజయేంద్ర ప్రసాద్.

‘బాహుబలి రెండు పార్ట్ లకు సంబంధించి నా పని పూర్తయిపోయింది. ఇప్పుడు సీరియల్ కి అనుగుణంగా రాయడం మొదలు పెట్టాలి. ఇందుకు టైం పడుతుంది. ఆ ఫార్మాట్ కు వీలుగా కేరక్టరైజేషన్ పెంచాల్సి ఉంటుంది' అంటూ బాహుబలి రైటర్ చెప్పిన మాటలతో.. బుల్లితెరపై కూడా బాహుబలివస్తున్న విషయం తేలిపోయినట్లే. మన రెగ్యులర్ సీరియళ్లలాగా కాకుండా హాలీవుడ్ టెలివిజన్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో బాహుబలి సిరీస్ ఉండబోతుందని సమాచారం.

అంటే ఒక్కో పార్ట్ 10 నుంచి 15 ఏపిసోడ్స్ అవి అయిపోగానే కొత్త కథ మొదలవుతుంది. ఇక ఇప్పటికే కామిక్ తో పిల్లలను అలరించిన ఈ హిస్టారికల్ మూవీ త్వరలో బుల్లితెరను ఏలేందుకు సిద్ధమైపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali serial  Vijayendra Prasad Baahubali  

Other Articles