న్యాయస్థానానికి నటి రంభ గైర్హాజరు Actor Rambha moves court seeking legal custody of children

Actor rambha moves court seeking legal custody of children

rambha, rambha actor, rambha actress, south indian actress rambha, rambha court, rambha children, rambha movies, rambha news, entertainment news, Tolywood

Yesteryear actor Rambha today moved a Family Court here seeking to declare and appoint her as a natural guardian of her minor children.

న్యాయస్థానానికి నటి రంభ గైర్హాజరు

Posted: 12/04/2016 01:33 PM IST
Actor rambha moves court seeking legal custody of children

నిన్న మొన్నటి వరకు తన అందం, అభినయంతో తెలుగు చిత్రసీమను ఏలిన ముద్దుగుమ్మ రంభ తన కేసు విచారణ కోసం న్యాయస్థానానికి గైర్హాజరయ్యారు. ఈ కేసును నాయ్యస్థానం జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. నటి రంభ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉండగానే కెనడాకు చెందిన ఇంద్రన్‌ పద్మనాభన్‌ అనే వ్యాపారవేత్తను 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానంతం నటనకు దూరంగా ఉన్న రంభకు 2011లో లాన్యా అనే కూతురు, 2015లో సాషా అను మరో కూతురు పుట్టారు.

ఆరేళ్లుగా సంతోషంగా సాగిన ఇంద్రన్, రంభల సంసార జీవితంలో మనస్పర్థల కారణంగా ముసలం పుట్టింది. దీంతో ఇటీవల రంభ భర్తను వదిలి ఇండియాకు వచ్చేశారు.ఇటీవల రంభ తనకు పిల్లలతో ఒంటరిగా జీవించడం సాధ్యం కావడం లేదని, అందువల్ల తన భర్తతో కలిసి ఉండేలా ఆదేశించాల్సిందిగా కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో తన భర్త మద్యం తాగి తనను హించించేవారని, అత్తింటి వారు తన పిల్లల్ని వారి కుటుంబంలో చేర్చుకోవడానికి అంగీకరించని కారణంగా తాను మనస్తాపానికి గురై భర్తకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు.

తాను తన భర్తతో చేర్చే వరకూ తనకు జీవన భృతిగా నెలకు రూ 2.5 లక్షలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ శనివారం విచారణకు రాగా రంభ కోర్టుకు హాజరు కాలేదు. అయితే తాను పని ఒత్తిడిలో ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని, అందువల్ల విచారణను వాయిదా వేయాల్సిందిగా రంభ తరఫు న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించుకోవడంతో ఈ కేసును జనవరి 21వ తేదీకి  వాయిదా వేస్తున్నట్లు నాయస్థానం ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  rambha  south india  court  rambha news  entertainment news  tollywood  

Other Articles