బాహుబలి-2 వార్ సీన్ లీకైంది.. అంతలోనే డిలీట్ చేసేశారు.. ఏముందసలు? | Baahubali 2 war scene video leaked and later deleted.

Baahubali 2 war scene leaked

Baahubali 2, War scene leaked, Baahubali 2 Video Leaked, baahubali 2 war scene, Baahubli The Conclusion War Scene, Baahubali The Conclusion, Baahubali 2, Baahubali war scene

Baahubali 2 War Scene Leaked, unit file complaint at Cyber Crimes department.

నెట్ లో కంక్లూజన్ వార్ సన్నివేశం?

Posted: 11/22/2016 09:36 AM IST
Baahubali 2 war scene leaked

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. ఇప్పుడు దానికి రెండో పార్ట్ చిత్రీకరణంలో బిజీగా ఉన్న సమయంలో, బాహుబలి 2 గురించి ఓ కొత్త అప్ డేట్. యుద్ధ సన్నివేశంకి సంబంధించి వీడియో లీకైందంటూ నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సుమారు 2.20 నిమిషాల నిడివి ఉన్న వీడియో ట్విట్టర్ లో ప్రత్యక్షమై ఆపై డిలేట్ అయ్యిందని తెలుస్తోంది. అమరేంద్ర బాహుబలితోపాటు దేవసేన కూడా ఆ వీడియోలో ఉన్నట్లు సమాచారం.

అయితే ఆ వీడియో లీకేజీపై చిత్ర యూనిట్ మాత్రం స్పందించకపోయినా, సైబర్ క్రైంకి ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. గతంలో ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన వీడియో లీక్ కావటం, గ్రాఫిక్స్ టీంకు చెందిన ఉద్యోగి ఒకరు చేసిన నిర్వాకంతో పెద్ద రచ్చ రేగటం తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఏదో ఒకరకంగా వీడియోలు లీక్ కావటం ఈ మధ్య బాగా అలవాటుగా మారిపోయింది.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మొదటి పార్ట్ బాహుబలి ది బిగినింగ్ విజువల్ వండర్ భారీ వసూళ్లతో పాటు, టెక్నాలజీ పరంగా కూడా ప్రాంతీయ చిత్రం ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరూపించింది. జనవరిలో టీజర్, ఆపై ట్రైలర్, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న 'బాహుబలి 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్‌, శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలోఇప్పటికే అమ్ముడు పోయాయి కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahubali 2  War scene  Video  Leaked  

Other Articles