కొరటాల కథనే కాదు.. కాన్సెప్ట్ ను కూడా కాపీ చేస్తున్నాడా? | Kollywood Senior Actor in Boyapati Srinu's next

Sharath kumar in boyapati s next

sarath kumar for Alludu Seenu, Kollywood Senior Actor in Boyapati Srinu's next, Sarath Kumar Boyapati Srinu, Boyapati again copy Koratala Idea, Boyapati follows Koratala Formula, Sarat Kumar tollywood re entry, Sarath Kumar tollywood movies

Kollywood Senior Actor Sarath Kumar in Boyapati Srinu-Bellamkonda Sai Srinivas's Movie.

బోయపాటి ఆ ఐడియా కూడా కాపీయేనా?

Posted: 11/09/2016 11:55 AM IST
Sharath kumar in boyapati s next

దర్శకుడు బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ హిట్లే కాదు.. రైటర్లతో వివాదాలతోనూ ఈ మద్య తరచూ వార్తల్లోకెక్కుతున్న విషయం తెలిసిందే. లైఫ్ ఇచ్చిన తన గురించే తప్పుడు ప్రచారం చేశాడని పోసాని, తన సింహ కోసం తన కథ, మాటలను వాడుకుని హ్యాండిచ్చాడని కొరటాల బహిరంగ విమర్శలు చేసినా, ఎక్కడా బోయపాటి నోరు మెదపలేదు.

బన్నీతో సరైనోడు హిట్ అందుకున్నాక ప్రస్తుతం అల్లుడు శీను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి. కొత్త హీరో, పైగా రెండు ఫ్లాపులతో ఉన్నాడు కదా. అందుకే సినిమాకు హైప్ తెచ్చేందుకు మరో సీనియర్ నటుడిని రంగంలోకి దించబోతున్నాడంట. కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగువారికి సుపరిచితుడైన శరత్ కుమార్ ను ఈ సినిమాలో నటింపజేసేందుకు రంగం సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఎప్పటి నుంచో తెలుగులో గ్రాండ్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న శరత్ కుమార్ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడే బోయపాటిపై మళ్లీ పంచ్ లు పేలుతున్నాయి. గతంలో సత్యరాజ్, మోహన్ లాల్ లను టాలీవుడ్ లోకి తెచ్చి వారి ద్వారా సినిమాలకు హైప్ పెంచటమే కాదు, ఇండస్ట్రీ సూపర్ హిట్లు అందుకున్నాడు కొరటాల శివ. దీంతో ఈసారి కథను కాకుండా... కాన్సెప్ట్ ను కాపీ కొట్టాడంటూ బోయపాటిపై సెటైర్లు వేస్తున్నారు కొందరు. ఏదైతేనేం హిట్ పడితే చాలూ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boyapati Srinu  Bellamkonda Sai Srinivas  Sarath Kumar  

Other Articles