కోలీవుడ్ లో మరో సెన్సేషన్ సినిమా టీజర్ | bogan official teaser released

Bogan official teaser released

Bogan teaser, jayam ravi Bogan telugu teaser, Bogan official teaser, Jayam Ravi's Bogan, Bogan Ravi Aravind swamy chemistry, Hansika hot in Bogan, Hansika romance in Bogan

Jayam Ravi's Bogan Teaser released.

అప్పుడు శత్రువులు మరి ఇప్పుడు...

Posted: 11/05/2016 05:24 PM IST
Bogan official teaser released

కోలీవుడ్ లో జయం సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన రవి ఆ తర్వాత కెరీర్ లో వరుసగా ఓ మూడు రీమేక్ లతో హిట్లు అందుకుని, ఆపై అన్ని ఫ్లాప్ లే మూటగట్టుకున్నాడు. కానీ, అన్న మోహన్ రాజా తొలిసారి సొంత కథతో చేసిన తనిఒరువన్ ప్రయత్నం తెలుగు మూలాలు ఉన్న ఈ హీరో కెరీర్ నే మార్చేసింది.

తమిళంలో పెద్ద పెద్ద హీరోలకు కూడా దిమ్మదిరిగిపోయేలా భారీ వసూళ్లు రాబట్టిన తని ఒరువన్ కి ప్రధాన ఆకర్షణ కథ ఒకటయితే, అందులో అరవింద స్వామి, జయం రవిల మధ్య కెమిస్ట్రీ మరో ఎత్తు. అందుకే మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆ సినిమానే తన ఛాయిస్ గా(ధ్రువ) ఎంచుకున్నాడు. ఇక బద్ధశత్రువులుగా ఆ సినిమాలో అదిరిపోయే ఫర్ ఫార్మెన్స్ ఇచ్చిన ఈ ఇద్దరు ఇప్పుడు చేతులు కలిపారు. బోగన్ చిత్రంతో కోలీవుడ్ లో ఇప్పుడు మరో సినిమా వస్తోంది.

 

జయం రవితో ‘రోమియో జూలియట్’ అనే సినిమా తీసిన లక్ష్మణన్ దర్శకుడు. ‘బోగన్’ టీజర్ తాజాగా రిలీజైంది. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ తమిళనాట హాట్ టాపిక్ అవుతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని లక్ష్మణన్ తీర్చిదిద్దిన తీరు టీజర్లో స్పష్టంగా కనిపిస్తోంది. డార్క్ కామెడీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జయం రవి.. అరవింద్ స్వామి కెమిస్ట్రీ ఇందులో మరింత బాగా పండినట్లుగా కనిపిస్తోంది. టీజర్ చివర్లో పాత పాడపాడుతూ కూడా భలే ఫన్నీగా ఉంది. రవి.. హన్సిక కలిసి రొమాన్స్ కూడా ఓ రేంజిలో పండించినట్లున్నారు. ఈ చిత్రానికి ప్రభుదేవా నిర్మాత కావడం విశేషం. ఇంతకుముందు ఈ డిసెంబర్లోనే ‘బోగన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య యమపాశం అంటూ తన జాంబీ సినిమాను తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలిన ఇతగాడు బోగన్ కూడా రిలీజ్ చేయబోతున్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bogan Teaser  Jayam Ravi  Hansika  Aravind swamy  

Other Articles