శాతకర్ణిపై ఎన్టీఆర్ కు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు | NTR no Phone Call to Krish about Satakarni

Ntr no phone call to krish about satakarni

NTR not intrested on Satakarni, NTR no phone call to Krish, Krish NTR phone Call, NTR Balayya Satakarni, Satakarni NTR, Junior not excited on Satakarni

NTR not intrested on Balayya's 100 Satakarni. Phone Call to Krish about Satakarni totally fake.

క్రిష్ కి ఫోనా? తారకా?... ఎవరు చెప్పారు?

Posted: 10/26/2016 09:25 AM IST
Ntr no phone call to krish about satakarni

నందమూరి నటవారసుడిగా బాలయ్య అప్పుడెప్పుడో క్రియేట్ చేసిన రికార్డులను, గ్యారేజ్ తో జూనియర్ రాముడు బద్ధలు కొట్టేశాడు. అయితే సదరు రికార్డుల గురించి ఎక్కడా ప్రస్తావన తేకుండానే తారక్ ఆ సక్సెస్ ఎంజాయ్ చేసేశాడు కూడా. అప్పుడెప్పుడో అదుర్స్ సినిమా టైంలో కలుసుకున్న ఈ బాబాయ్-అబ్బాయ్ లు కుటుంబ అంతర్గత కలహాలతో దూరం అయ్యారు. మళ్లీ ఎప్పుడెప్పుడు కలుసుకుంటారా అని అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ తో అభిమానులు.. వాళ్ల నోట్లో పంచదార పోసినట్లుగా ఫీలయిపోయారు.

శాతకర్ణి టీజర్ చూసి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ సన్నిహితులతో అదరిపోయిందని ప్రస్తావించాడని, ఆ రోల్ బాలయ్య తప్ప ఇంకెవరు చేయలేరని పొగిడాడని, మొత్తం బాలయ్య వందో చిత్రంపై యంగ్ టైగర్ చాలా ఎక్సయిట్ అవుతున్నాడని ఓ కథనం. ఇప్పుడేమో క్రిష్ కు ఫోన్ కాల్ చేసి కొన్ని క్లిప్ లను చూపించాలని కోరినట్లు కొన్ని మీడియాలు ప్రచురించాయి. మరి అదసలు నిజమేనా అన్న ప్రయత్నాలు చేయాలి కదా. అధికారికంగా తెలిసిందేంటంటే... అదంతా క్రియేటి విటి అని.

బాలయ్య-తారక్ లు కలవాలని కోరుకుంటున్న ఓ ఫ్యాన్స్ వర్గం ఈ వార్తను కొన్ని వెబ్ సైట్లకు చేరవేస్తే వారు తిప్పి.. తిప్పి... తెగ వైరల్ చేసేశారు. ఆ లెక్కన బాబాయ్ కి ప్రేమతో ఇప్పట్లో లేదన్నమాట. అయినా బాబాయ్ తో ఎటువంటి గొడవలు లేవని ఎన్టీఆర్ చెబుతున్నప్పటికీ, నందమూరి ఇగోలు తెలిసి కూడా ఓపెన్ గా వారు కలిసేంత వరకు ఇలాంటి వార్తల జోలికి వెళ్లకపోవటమే చాలా బెటర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Phone Call  Director Krish  Fake News  

Other Articles