టైటిల్ త్యాగం సప్తగిరికి ఇలా కలిసొచ్చింది | pawan kalyan likely to attend Saptagiri Express audio launch

Pawan kalyan likely to attend saptagiri express audio launch

Pawan saptagiri, Pawan Chief guest to Saptagiri movie Audio launch, Saptagiri Movie Audio Launch, Katamarayudu chief guest for Saptagiri's Audio, Pawan Kalyan chief guest for Saptagiri Express audio

Due to title sacrifice pawan kalyan likely to attend Saptagiri's Debut movie Express audio launch.

సప్తగిరి కోసం పవన్ వస్తున్నాడంట...

Posted: 10/24/2016 12:48 PM IST
Pawan kalyan likely to attend saptagiri express audio launch

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కమిట్ మెంట్ ను మరోసారి చూపించబోతున్నాడంట. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయటంలో ముందుండే ఆయన ఈసారి ఎవరి కోసం కదలబోతున్నాడో తెలుసా? తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన సప్తగిరి కోసం. ఎందుకంటారా? అతను చేసిన త్యాగం అలాంటిది మరీ.

తన డెబ్యూ చిత్రం కోసం కాటమరాయుడి టైటిల్ ను ముందుగా రిజిస్టర్ చేసుకున్న సప్తగిరి, ఆపై పవన్-డాలీ చిత్రం కోసం దానిని తృణ ప్రాయంగా వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన చిత్రానికి ఎక్స్ ప్రెస్ సెంటిమెంట్ తో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ గా మార్చేసుకున్నాడు. మరి అంత సాయం చేసిన సప్తగిరికి పవన్ ఎంకరేజ్ మెంట్ ఉండాలి కదా. అందుకే ఆ చిత్ర ఆడియో పంక్షన్ అటెండ్ కావాలని నిర్ణయించుకున్నాడంట.

అక్టోబర్ 27న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేస్తుండగా, ఆడియోలో కాటమరాయుడు సందడి చేయబోతున్నాడన్న మాట. మొత్తానికి సప్తగిరి త్యాగం వృథా పోలేదు. పవన్ ఫ్యాన్స్ అటెన్షన్ కొట్టేయడం కన్నా మించిన జాక్ పాట్ సప్తగిరికి ఏముంటుంది చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saptagiri Express Movie  Pawan Kalyan  Chief guest  Audio Launch  

Other Articles