రకుల్ యాక్సిడెంట్ ను మీడియా పట్టించుకోదా? | Rakul no experience in Action Sequences.

Rakul injured in mahesh movie shooting

Rakul injured, Rakul injured in Mahesh Movie shooting, media ignored Rakul accident, Rakul Preet Accident, Rakul in Mahesh Movie sets, Rakul with Mahesh Babu

Rakul Preet injured in mahesh movie shooting because pf no experience in Action Sequences.

ఆ అనుభవం లేకనే రకుల్ దెబ్బ తిందా?

Posted: 10/21/2016 04:07 PM IST
Rakul injured in mahesh movie shooting

ఓ స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ యాక్సిడెంట్ కి గురైందంటే ఆ వార్త పెద్ద చర్చగా మారాలి. కానీ, మీడియాలో అది ఎక్కడా రావటం లేదు. అసలు కారణం ఏంటి? మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన నటిస్తున్న రకుల్ ఆ సినిమా షూటింగ్ లోనే గాయపడిందంట. కానీ, ఎక్కడా దానికి సంబంధించిన వార్త లేదు. ఎందుకంటారా? దానికి కారణం ఉంది.

అదేం పెద్ద ప్రమాదం కాదు కాబట్టి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో మహేష్ తో పాటు రకుల్ కూడా పాల్గొంటుంది. స్టంట్స్ చేస్తుండగా రకుల్ కాలికి గాయం అయ్యింది. అయితే పెద్దగా ఇబ్బందేమీ లేదని యూనిట్ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమాకు సంబంధించిన ఛేజింగ్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. మరి ఇలాంటి ఫీట్స్ లో ఎక్స్ పీరియన్స్ లేకపోవడం వల్లే రకుల్ కు ఇబ్బందిగా మారి ఉండొచ్చు.

ఇక తనకు తగిలింది చిన్న దెబ్బేనని ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది రకుల్. చిటికెన వేలుకు మాత్రమే గాయమైంది కంగారు పడకండి అంటూ అభిమానులకు చెబుతోంది. తాను కోలుకోవాలని మెసేజ్ లు పంపిన వారందరికీ థాంక్స్ అంటూ లవ్ అండ్ కిస్ ఓ సందేశం ఉంచింది.  మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ లో  తిరిగి జాయిన్ అవుతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Accident  injure  Mahesh Babu movie  

Other Articles