ఉదయభాను మ్యాటర్ లో సునీత తప్పు ఒప్పేసుకుందా? | Sunitha opens up about clash with Udaya Bhanu

Sunitha opens up about clash with udaya bhanu

Actress Sunitha opens up about insult Anchor, Actress Sunitha vs Anchor Udaya Bhanu, Udaya Bhanu Sunitha Clash, Clash between Udaya Bhanu and Sunitha, Sunitha really hurts Udaya Bhanu

Actress Sunitha opens up about insult Anchor Udaya Bhanu.

సునీత-భాను గొడవ నిజమే అయితే ఏంటి?

Posted: 10/20/2016 05:34 PM IST
Sunitha opens up about clash with udaya bhanu

వివాదాల సమయంలో సెలబ్రిటీలు ఎలా స్పందించినా సరే వారికి చిక్కులు తప్పవు. స్పందించకపోతే అవి మరింత ముదురుతాయి, స్పందిస్తే నిజమనే అంతా అనుకుంటారు. ఆ మధ్య ఓ టాప్ యాంకర్, సింగర్ మధ్య జరిగిన ఇంటర్నల్ గొడవ, సదరు యాంకర్ గారి పుణ్యమాని బయటికి వచ్చేసింది. ఇంతకీ వారు ఎవరో కాదు... సునీత, ఉదయభానులు.

ఓ ఈవెంట్ లో తనను స్టేజీ మీదకు పిలవలేదంటూ ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో సింగర్ పై ఆరోపణలు చేసింది. అంతేకాదు, తాను స్టేజీ మీదకు వెళ్తుంటే ఆమె తాలుకు ఆర్కెస్ట్రా వారు సాడ్ సాంగ్ ప్లే చేశారంటూ కన్నీరు పెట్టుకుంది. పేరు చెప్పకపోయినా ఆమె సునీతేనని అంతా డిసైడ్ అయిపోయారు. దానికి సునీత ఇప్పుడు బదులు ఇస్తోంది.

ఆ మధ్య ఉదయభాను నా పేరు చెప్పకుండానే విమర్శలు గుప్పించింది. అది నా పేరే అని నాకు తెలుసు. ఆమెను ఇన్వైట్ చేయడానికి అది నా కార్యక్రమం కాదు. పైగా ఆమెను అవమానించానని చెబుతున్నదాంట్లో అర్థం పర్థం లేదు. ఆ రోజు అసలు ఏం జరిగిందో నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. ఆ తర్వాత కూడా చాలా సార్లు మేం కలుసుకున్నాం. కానీ, ఆమె మొహం పక్కకు తిప్పుకుని ఉంది. నా తప్పేం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక్కడ తప్పుఒప్పులు, హర్టవ్వటాలు పక్కన బెడితే ఇద్దరు ఎవరి వర్షన్ వారు చెప్పేసుకుంటున్నారు. కానీ, ఓవరాల్ గా మన పరువు మనమే తీసుకున్నట్లు అవుతుంది కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటే మంచింది. ఒకవేళ పొరపాట్లు జరిగినా అక్కడికక్కడే సాల్వ్ చేసుకుంటే ఇలా మీడియాకు ఎక్కకుండా ఉండొచ్చు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Udaya Bhanu  Singer Sunitha  Insult  

Other Articles