కాజల్ కోసం ఇప్పుడు కూడా క్యూనా? | Directors que for Kajal

Directors que for kajal

Kajal Movie Offers, Kajal Item turns, Kajal in thala 57 Movie, Kajal second innings, Kajal in Chiru movie, Janatha Garage turns her life

Actress Kajal Agarwal again busy with back to back movies.

కాజల్ కోసం ఇప్పుడు కూడా క్యూనా?

Posted: 09/28/2016 10:41 AM IST
Directors que for kajal

(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#k2Tab1)

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటింది, మూడు పదుల వయసు పైబడిపోయింది. పైగా మునపటి గ్లామర్ పోయింది, పైగా చేతిలో సినిమాలు లేవుగా. ఇక కాజల్ పని అయిపోయినట్లే అంతా డిసైడ్ అయ్యారు. కానీ, ఐటెం రూపంలో కాజల్ కి అదృష్టం పైకి లేపింది. జనతా గ్యారేజ్ లో స్లిమ్ అవతారంలో ఐటెం సాంగ్ లో ఇరగదీసిన కాజల్ ను చూసి మళ్లీ దర్శకులు ఎగబడిపోతున్నారు. సౌత్ లోని దాదాపు అన్ని భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తి, ఇప్పుడు చందమామ ఫుల్ బిజీ అయిపోయిపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కాజల్ అప్ కమింగే కాదు... ఇప్పుడు వస్తున్న ఆఫర్లు కూడా భారీ పారితోషికంతోనే వస్తుండటం విశేషం. మెగాస్టార్ రీఎంట్రీ 'ఖైదీ నంబర్ 150'తో పాటు, తనను పరిచయం చేసిన దర్శకుడు తేజ దర్శకత్వంలోను నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళంలో చాలా బిజీ అయిపోయింది. జీవాతో కలసి నటించిన 'కవలైవేండాం' సినిమా విడుదలకు రెడీ అవుతుండగా, అజిత్ నటిస్తున్న 57వ సినిమాలో కూడా ఆమె కథానాయికగా నటిస్తోంది. అలాగే, యువ దర్శకుడు సోక్రటీస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి కాజల్ సంతకం చేసింది. అదే సమయంలో కన్నడలో సుదీప్ సరసన నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉండగానే అట్లీ డైరక్షన్ లో ఇదయదళపతి విజయ్ సినిమాలో కూడా నటించే నటించే చాన్స్ ఈ ముద్దుగుమ్మకే నని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇలా కొరటాల శివ పుణ్యామాని సినిమాలో మెయిన్ హీరోయిన్ల కంటే ఒక్క పాటతో ఊపేసిన కాజల్ కి పెద్ద హెల్ప్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లా భావిస్తున్న కాజల్ మరో రెండు సంవత్సరాలు సినిమాలతో బిజీగా ఉండటంతో పెళ్లి నిర్ణయాన్ని కూడా వాయిదా వేసుకున్నానని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  second innings  busy  movies  

Other Articles