మహేష్ సినిమా మేసేజ్ గురించి కొరటాల | koratala siva clarify on second movie with Mahesh Babu

Koratala siva clarify on second movie with mahesh babu

koratala siva clarify on second movie with Mahesh, Koratala Mahesh next movie, Koratala about Mahesh second movie, Mahesh ready to magic with koratala again, Mahesh new movie from January, Mahesh Two movies in same year

koratala siva clarify on second movie with Mahesh Babu deal with message and Entertainment.

మహేష్ సినిమాపై ఇంకో క్లారిటీ

Posted: 09/19/2016 11:43 AM IST
Koratala siva clarify on second movie with mahesh babu

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ టాప్ డైరక్టర్ల జాబితాలో చేరిపోయి హాట్ టాపిక్ గా మారిపోయాడు కొరటాల శివ. రచయితగా కెరీర్ ప్రారంభించి పవర్ ఫుల్ డైలాగులు అందించి, ఆపై మిర్చితో దర్శకుడిగా మారి హిట్ అందుకున్నాడు. మహేష్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో  అలా చూపించి శ్రీమంతుడితో ఇండస్ట్రీ సెకండ్ హిట్ ను అందజేశాడు. తాజాగా యంగ్ టైగర్ ను ఊరిస్తూ వస్తున్న ఇండస్ట్రీ హిట్ ను జనతా గ్యారేజ్ తో అందించి అలుపెరగని విజయాల దర్శకుడు రాజమౌళి సరసన నిలిచాడు.

ప్రస్తుతం గ్యారేజ్ విజయోత్సహాంలో బిజీగా ఉన్న కొరటాల తన తదుపరి చిత్ర విషయంలో కూడా పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే కొరటాల తన తదుపరి చిత్రం ఉండబోతుందనే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై మరోసారి క్లారిటీ ఇస్తూ ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పాడు. 'శ్రీమంతుడు' మాదిరిగానే ఓవైపు ‘సోషల్ మెసేజ్’ ను ఇస్తూనే, ఇంకోవైపు వినోదాత్మకంగా కథ కొనసాగుతుందని తెలిపాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమాను జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు చెప్పాడు.

ప్రస్తుతం మహేష్ మురగదాస్ బైలింగువల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో అది రిలీజ్ కానుంది. ఈ మూడు నెలలు టైం తీసుకుని కొరటాల స్ట్రిప్ట్ ని పవర్ పుల్ గా తీర్చిదిద్దుతాడన్న మాట. అనుకున్నట్లుగా ఈ సినిమా నిజంగా జనవరి నుంచే సెట్స్ మీదకు వెళితే మాత్రం ఇక తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా మహేష్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొనటం చూడొచ్చన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Koratala Siva  Mahesh Babu  Second movie  Shooting  starts  January  

Other Articles