Avasarala Srinivas to direct sucessful hero nani

Nani to team up with avasarala for his next film

nani, tollywood hero nani, tollywood actor avasarala srinivas, tollywood, avasarala srinivas direction

tollywood sucessful hero nani to team up with avasarala srinivas for his next film

మళ్లీ అవసరాలతో జతకట్టిన నాని..

Posted: 09/03/2016 12:53 PM IST
Nani to team up with avasarala for his next film

అష్టాచమ్మ సినిమాతో తమ సినీ కెరీర్ ను ఒక్కేసారి ప్రారంభించిన యంగ్ హీరో నాని, నట దర్శకుడు అవసరాల శ్రీనివాస్లలో నాని తన కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ సాగిపోతున్నాడు. వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న నాని వినూత్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ.. తన కెరీర్ లో గతంలో వచ్చిన గ్యాప్ ను రానీయకుండా చక్కగా ప్లాన్ చేసుకుని, ఉత్తమ కథలను ఎంపిక చేసుకుని సాగిపోతున్నాడు. దీంతో తెలుగుచలనచిత్ర పరిశ్రమలో నాని హీరోగా సెటిల్ అయ్యారు.

అయితే అవసరాల శ్రీనివాస్ మాత్రం అటు చిత్రాలలో కామెడీ పాత్రలు చేస్తూనే దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసిన అవసరాల దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందిన జ్యో అచ్యుతానంద సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అవసరాల శ్రీనివాస్.. ఆ తరువాత నాని హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

వరుస సక్సెస్లతో నాచురల్ స్టార్గా ఎదిగిన నాని కూడా అవసరాలతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమాలు చేసే ఈ ఇద్దరి కాంబినేషన్పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి వీరిద్దరి చిత్రం ఏ మేరకు అభిమానుల అంచనాలను నిలబెడుతుంది అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nani  tollywood hero nani  tollywood actor avasarala srinivas  tollywood  

Other Articles