షారూఖ్ పాక్ అభిమాని జైలులో | sharukh pak fan arrested for made sandals with deer skin

Sharukh pak fan arrested for made sandals with deer skin

Pakistani shoemaker for Shah rukh khan, sharukh pak fan arrested for made sandals, Shahrukh sandals lands him in jail, Shahrukh sandals with deer skin, Shahrukh pak fan arrested

A Pakistani shoemaker has landed himself in jail after he boasted to the media that he was going to send Peshawari sandals made from deer’s skin to Bollywood superstar Shahrukh Khan.

షారూఖ్ చెప్పులు అతన్ని జైలుకు పంపాయి

Posted: 08/27/2016 03:22 PM IST
Sharukh pak fan arrested for made sandals with deer skin

హీరోలంటే అభిమానం ఉండాలి. కానీ, అది అతి అయితే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఇటీవల చూస్తున్నాం. ఇలాంటి అభిమానంతోనే తాజాగా షారూఖ్ ఫ్యాన్ ఒకరు జైలు పాలు కావాల్సి వచ్చింది. వివరాళ్లోకి వెళ్లితే...   పాకిస్థాన్ దేశంలోని పెషావర్‌కు చెందిన జహంగీర్ ఖాన్ షారూఖ్ అభిమాని. పాక్ లో ఉంటున్న షారూఖ్ బంధువు ఒకరు అతని దగ్గరికి వెళ్లి షారూఖ్ కోసం చెప్పులు కుట్టాల్సిందిగా కోరాడు. తన అభిమాన హీరోకు చెప్పులు కుట్టడమే మహద్భాగ్యంగా భావించిన జహంగీర్ రెండు జతల చెప్పులు కుట్టాడు.

అయితే ఇందుకోసం అతను జింకల చర్మం వాడాడని ఆరోపిస్తూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జహంగీర్ షారూఖ్ కోసం చెప్పులు కుట్టేందుకు జింక చర్మం తెప్పించాడన్న సమాచారం అందుకున్న వన్యప్రాణి విభాగం జహంగీర్ ను అదుపులోకి తీసుకుని ఆపై విషయం ధృవీకరణ చేసుకుని పోలీసులకు అప్పగించింది.

అయితే చెప్పుల తయారీకి జహంగీర్ జింక చర్మం వాడాడా లేదా అనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని వన్యప్రాణి విభాగం అధికారులు చెప్పారు. అంతరించిపోతున్న వన్యప్రాణులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న నేటి తరుణంలో జింక చర్మంతో చెప్పులు కుట్టడంపై విమర్శలు వినిపించాయి. తన అభిమాన హీరోకి ప్రత్యేక బహుమతి ఇద్దామనుకున్న ఈ వీర ఫ్యాన్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahrukh Khan  Pak  fan  arrest  sandals  deer skin  

Other Articles