శ్రేయాతో అఖిల్ ఫోటో | akhil spotted with girl friend Shriya at a private party

Akhil spotted with girl friend shriya at a private party

Akkineni akhil Shriya Bhupal, Shriya Bhupal with Boy friend, Akkineni akhil girl friend, akhil girl friend Shriya Bhupal, subbi ramireddy daughter swathi, subbi ramireddy daughter swathi

Akkineni akhil spotted with girl friend Shriya at a private party

గర్ల్ ఫ్రెండ్ తో అఖిల్ అఫీషియల్ గా...

Posted: 08/27/2016 01:45 PM IST
Akhil spotted with girl friend shriya at a private party

టాలీవుడ్ లో ట్రెండీ టాపిక్ గా మారిపోయింది అక్కినేని సన్స్ లవ్ మ్యాటర్. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య సమంతతో ప్రేమలో మునిగి, పెళ్లికి రెడీ అయిపోతుంటే, తాను మాత్రం లైఫ్ ఇంకా ఎంజాయ్ చేయాలంటూ గర్ల్ ఫ్రెండ్ తో ఓపెన్ గానే తిరిగేస్తున్నాడు చిన్నబ్బాయి అఖిల్.

ఇంటర్వ్యూలో ఓపెన్ గా తాను ప్రేమలో పడ్డ విషయం బయట పెట్టాడో లేదో అతను ప్రేమించిన అమ్మాయి ఎవరనే విషయం కొన్ని గంటల్లోనే లీక్ అయిపోయింది. జీవీకే గ్రూప్ అధినేత కూతురి కూతురు అయిన శ్రేయా భూపాల్ తో అఖిల్ ప్రేమలో పడ్డాడని ఓపెన్ అయిపోయింది. ఇక కొడుకుల ప్రేమలు, వారి పెళ్లిళ్లపై పాజిటివ్ గానే స్పందించిన నాగ్, చైతూ వ్యవహారం త్వరలో తేలినా, అఖిల్ కు ఇంకా అంత వయసు రాలేదని, దానికి ఇంకా టైం ఉందని చెప్పేశాడు.

ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇద్దరు ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి, టి.సుబ్బిరామి రెడ్డి చెల్లెలు కొడుకుని ఈ మధ్యే వివాహం చేసుకుంది. వీరంతా గత రాత్రి పార్టీ చేసుకున్నారు. దానికి ఈ ఇద్దరు ఇలా ఫోజులిస్తూ ఉండటం విశేషం. ఇందులో లక్ష్మీప్రసన్న, ఫ్యాషన్ డిజైనర్ కమ్ కింగ్ ఫిషర్ మోడల్ శిల్పా రెడ్డి కూడా ఉన్నారు. చరణ్ వైఫ్ ఉపాసన కామినేని లాంటి సెలబ్రిటీలు కూడా అఖిల్ అండ్ శ్రీయ ను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో చేస్తుంటే వ్యవహారం ముదిరి పాకాన పట్టిందనే విషయం అర్థం అవుతుంది కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni akhil  Shriya Bhupal  

Other Articles