రాంచరణ్ కి రాఖీ కట్టిన పవన్ కూతురు పోలెనా | Pawan Kalyan's Daughter Polena Ties Rakhi To Charan

Pawan s daughter polena ties rakhi to charan

Pawan Kalyan's Daughter Polena, Pawan wife Anna Lezhneva, Anna Lezhneva daughter, Pawan with wife and daughter, Pawan wife with ram charan, Pawan daughter with cherry, Cherry rakhi with pawan daughter, pawan daughter Polena, Polena with Ram Charan

Pawan Kalyan's Daughter Polena Ties Rakhi To Charan.

చెర్రీకి స్పెషల్ రాఖీ కట్టిందెవరంటే...

Posted: 08/24/2016 10:03 AM IST
Pawan s daughter polena ties rakhi to charan

అన్నచెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవటం చూశాం. నిత్యం తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సెలబ్రిటీలు కూడా వారి బంధాలను ఫోటోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో ఆనందం పంచుకున్నారు. అయితే మెగా తనయుడు రాంచరణ్ మాత్రం తన స్పెషల్ సెలబ్రేషన్స్ ని ఇప్పుడు మన ముందు పెట్టాడు.

ఈ యేడాది తన స్పెషల్ రాఖీ స్పెషల్ అంటూ ఓ ఫోటో ఉంచాడు. ఇంతకీ చెర్రీకి స్పెషల్ గా రాఖీ కట్టింది ఎవరో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కూతురు. అదేనండీ పవన్ ప్రస్తుత భార్య అన్నా లెజ్నెవా కూతురు పోలెనా. ఈ మధ్య కుటుంబ పంక్షన్లకు మిస్సవుతూ వస్తున్న పవన్ ఆ స్థానంలో బార్య అన్నాను క్రమం తప్పకుండా పంపుతున్నాడు. శ్రీజ వివాహంలో చీర కట్టులో, చిరు బర్త్ డే పార్టీలో ఆమె సందడి చేయటం మనం చూశాం.

తన కూతురితో చెర్రీకి రాఖీ కట్టించడం ద్వారా మెగా ఫ్యామిలీలో ఆమె తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నట్లు కనిపిస్తోంది. ఆ విషయం పక్కనపెడితే ముద్దొచ్చే చిన్నారి పోలెనా చెర్రీకి రాఖీ కడుతున్న ఈ ఫోటో ఎంత క్యూట్ గా ఉందో కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  daughter  Polena  rakhi  ram charan  

Other Articles